Pawan Kalyan : బయటికి వచ్చి తప్పు చేశా.. పవన్‌ అన్నా క్షమించు

ఎట్టకేలకు ఏపీలో ప్రభుత్వం మారింది. టీడీపీ,జనసేన,బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ ఎన్నికలు ఎలాంటి సస్పెన్స్‌ క్రియేట్‌ చేశాయో.. ఎన్నికల ముందు సీట్ల పంపకాలు కూడా అదే స్థాయిలో థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి.

ఎట్టకేలకు ఏపీలో ప్రభుత్వం మారింది. టీడీపీ,జనసేన,బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ ఎన్నికలు ఎలాంటి సస్పెన్స్‌ క్రియేట్‌ చేశాయో.. ఎన్నికల ముందు సీట్ల పంపకాలు కూడా అదే స్థాయిలో థ్రిల్లర్‌ సినిమాను తలపించాయి. తమ పార్టీలో టికెట్‌ రాని నేతలంతా పక్క పార్టీలకు వెళ్లిపోయారు. పవన్‌ అంటే ఎంతో విశ్వాసంగా పని చేసే కార్యకర్తలున్న జనసేన పార్టీలో కూడా ఇదే సీన్‌ కనిపించింది. ముఖ్యంగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయవాడ నేత పోతిన మహేష్ వైసీపీకి వెళ్లడం సంచలనంగా మారింది. వైసీపీకి వెళ్లడమే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు పోతిన మహేష్‌.

దీంతో జనసేన నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. అయినా సరే కూటమి ఓడిపోతుందని బలంగా నమ్మి వైసీపీ కోసం పనిచేశాడు మహేష్‌. కట్‌ చేస్తే కథ అడ్డం తిరిగింది. టచ్‌ కూడా చేయలేని స్థాయిలో కూటమి విజయం సాధించింది. దీంతో తాను చేసిన తప్పేంటో మహేకు అర్థమయ్యింది. నిజానికి జనసేన పార్టీలో కష్టపడి పని చేసిన కీలక నేతల్లో పోతిన కూడా ఒకరు. విజయవాడ టికెట్‌ ఆయనకే ఇస్తారని చాలా రోజులు ప్రచారం కూడా జరిగింది. పవన్‌ కళ్యాన్‌ కూడా ఈ విషయంలో పోతినకు హామీ ఇచ్చారు. కానీ కూటమి కారణంగా చాలా మంది టికెట్ల విషయంలో మార్పులు జరిగాయి..

ఇదే క్రమంలో పోతిన టికెట్‌ కూడా మిస్‌ అయ్యింది. ఆ ఒక్క రోజు భవిష్యత్తు ఆలోచించుకుని పోతిన జనసేనలో ఉంటే.. ఇవాళ పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు పార్టీకి దూరమై అధికారానికీ దూరమై ఎటూ కాని స్థితిలో పోతిన ఉన్నాడంటున్నారు విశ్లేషకులు. ఇప్పట్లో ఏపీలో వైసీపీ మళ్లీ కోలుకునే పరిస్థితి లేదు.. జనసేన నుంచి మళ్లీ పోతినకు మద్దతు ఉంటుందా అంటే గ్యారెంటీ లేదు. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే తెలియాలి అంటున్నారు.. గతంలో ఆయనతో పని చేసిన జనసైనికులు.