Janasena no chance : పవన్ కి షాకిచ్చిన మోడీ.. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే..

కేంద్ర కేబినెట్ (Central Cabinet) లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురుకి అవకాశం దక్కింది. ఏపీలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి వర్గంలో చోటిచ్చారు నరేంద్ర మోడీ. కానీ జనసేనకు అవకాశం కల్పించకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఏపీలో టీడీపీ(TDP), బీజేపీ (BJP) కోసం సీట్లు త్యాగం చేశాం... ఇప్పుడు మంత్రి పదవులు కూడా వదులుకోవాలా అని జనసైనికులు ఆవేదన చెందుతున్నారు.

కేంద్ర కేబినెట్ (Central Cabinet) లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురుకి అవకాశం దక్కింది. ఏపీలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి వర్గంలో చోటిచ్చారు నరేంద్ర మోడీ. కానీ జనసేనకు అవకాశం కల్పించకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఏపీలో టీడీపీ(TDP), బీజేపీ (BJP) కోసం సీట్లు త్యాగం చేశాం… ఇప్పుడు మంత్రి పదవులు కూడా వదులుకోవాలా అని జనసైనికులు ఆవేదన చెందుతున్నారు. రాబోయే మంత్రి వర్గ విస్తరణలో జనసేన (Janasena) కు అవకాశం ఉంటుందని చెబుతున్నా… ఇప్పుడు టీడీపీ రెండు, బీజేపీకి ఒకటి ఇచ్చారు. జనసేనకు కూడా ఇస్తే లెక్క సరిపోయేది. లేదంటే టీడీపీకి ఒకటి తగ్గించి తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ‌ లో కూటమి అనూహ్య విజయం వెనుక పవన్ సునామీ పనిచేసిందని NDA మీటింగ్ లో స్వయంగా చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi). పవన్ కు ఎప్పుడూ ప్రియారిటీ ఇస్తుండే మోడీ… జనసేనకు మాత్రం కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు. మిత్రపక్షాల్లో ఐదుగురు కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలకు సహాయ మంత్రి పదవి ఇవ్వాలని NDA లో నిర్ణయించారు. అలాగే కేటాయింపులు చేశారు. టీడీపీకి ఒక కేబినెట్, మరో సహాయం ఇచ్చారు. జనసేన నుంచి సీనియర్ ఎంపీ బాలశౌరి పేరు చివరిదాకా వినిపించినా… ఆయన్ని ఎందుకు ఎంపిక చేయలేదన్నది ప్రశ్నగా మారింది. అసలు కేబినెట్ లో చేరికకు పవన్ ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా… ఉంటే పార్టీ తరపున ఎంపీ అభ్యర్థి పేరును రికమండ్ చేశారా అన్న డౌట్స్ వస్తున్నాయి. తర్వాత చేపట్టే… కేంద్ర మంత్రి వర్గ విస్తరణ వరకూ వెయిట్ చేయాలని చంద్రబాబు ద్వారా పవన్ ను ఒప్పించినట్టు కొందరు చెబుతున్నారు.

ఏపీలో కూటమి (AP Alliance) అధికారంలోకి రావడానికి పవన్ కల్యాణ్ కారణమని తెలిసినా…. తమకు ప్రియారిటీ ఇవ్వకపోవడంపై జనసైనికులు మండిపడుతున్నారు. పైగా జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కాపులే కావడంతో… కాపులకు అవకాశం ఎందుకు ఇవ్వలేదన్న కోణంలోనూ డిస్కషన్ జరుగుతోంది.