సముద్రం ప్రతి ఒక్కరికి సముద్రాన్ని చూడాలని.. సముద్రంలోకి వెళ్లి గెంతాలని.. సముద్రం వద్ద కాస్త సమయం గడపాలని ప్రతి ఒక్కరికి ఓ కొరికా ఉంటుంది. ఇలా చాలా మంది అనుకున్న సముద్రం దగ్గరికి వెళ్లలేరు.. ఒక వేళ వెళ్లిన సముద్రంలో కి వెళ్లే ధైర్యం మాత్రం చెయ్యరు. ఎందుకంటే.. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు మన గుండెల్లో దడ పుట్టిస్తుంటుంది. ఇప్పడు వీటన్నిటికీ చెక్ పెట్టబోతున్నాం.. అంటే ఏంటి అంటారా..? ఇక పై సముద్రంలో నడబోతున్నాం.. ఎవరైన సముద్రంపై ప్రయాణిస్తారు కానీ.. నడుస్తారా అన్న ప్రశ్న తలెత్తుతుంది కాదు.. అవును ఇకపై మనం సముద్రంపై నిజంగానే నడవబోతున్నాం.. అది కూడా ఎక్కడో కాదు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ సాగర తీరంలో ఉన్న.. ఆర్కే బీచ్ లోనే.. అవును ఈ బీచ్ లోనే పర్యాటకుల కోసం ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకోచ్చారు.
ఇక విషయంలోకి వెలితే.. అందమైన బీచ్ లతో విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ (RK Beach) లో ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం రూ.కోటీ అరవై లక్షలతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని (Floating bridge) మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. మాజీ టీటీడీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని చెప్పుకోచ్చారు. పర్యాటకులకు ఇదొక మరపురాని అనుభూతిగా మిగులనుంది. ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్లోటింగ్ వంతెన వల్ల విశాఖలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.