GANTA Bheemili : గంటాకు అదే సీటు ఫిక్స్

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు (Ganta Srinivasa Rao) టీడీపీ (TTD) టిక్కెట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఆయన కోరుకున్నట్టుగా భీమిలీ (Bhimili) సీటు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు (Ganta Srinivasa Rao) టీడీపీ (TTD) టిక్కెట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఆయన కోరుకున్నట్టుగా భీమిలీ (Bheemili) సీటు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది. ఆ పార్టీ ఇప్పటికి మూడు జాబితాలు ప్రకటించినా… వాటిల్లో గంటా పేరు ఎక్కడా లేదు. ఆయన కోరుకుంటున్న భీమిలీ సీటు గానీ… పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిన చీపురుపల్లి స్థానాన్ని కూడా అధిష్టానం ప్రకటించలేదు. కానీ అటు ఇటూ చేరి గంటాకి భీమిలీ సీటే దక్కే అవకాశాలున్నాయి.

చీపురుపల్లిలో మంత్రి బొత్ససత్యానారాయణ (Botsasatyanarayana) కు పోటీగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్లాన్ వేశారు. ఆయన్ని చీపురుపల్లి వెళ్ళి ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు కూడా. అయితే అందుకు గంటా ఒప్పుకోలేదు. తనకు భీమిలీ టిక్కట్టే కావాలని పట్టుబట్టారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఈసారి పొత్తులో అది బీజేపీకి వెళ్ళింది. దాంతో గతంలో తాను పోటీచేసిన భీమిలీని కేటాయించాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా దాటి పోవడానికి గంటా ఒప్పుకోలేదు. భీమిలీలో గంటా అభ్యర్థిత్వంపై చంద్రబాబు ఈమధ్యే IVRS సర్వే చేయించారు. అందులో ఆయనకే అనుకూల ఫలితాలు వచ్చినట్టు సమాచారం. అందుకే భీమిలీని గంటా శ్రీనివాసరావుకు కేటాయించడం ఖాయమైంది. నాలుగో జాబితాలో పక్కాగా గంటా పేరు కూడా ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక చీపురుపల్లిలో బొత్స సత్యానారాయణపై ఎవర్ని నిలబెట్టాలన్న దానిపై టీడీపీలో తర్జన భర్జన నడుస్తోంది. సీనియర్ నేత కళా వెంకట్రావును చీపురుపల్లి వెళ్ళాలని కోరుతున్నా… ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎచ్చెర్ల సీటు కావాలని అడుగుతున్నారు. అయితే చీపురుపల్లికి ఇప్పటికే కిమిడి నాగార్జున ఇంఛార్జ్ గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కళా వెంకట్రావు లేదంటే కిమిడి నాగార్జునలో ఎవరో ఒకర్ని చీపురుపల్లిలో బొత్సపైన టీడీపీ నిలబట్టే అవశాలు ఉన్నాయి. తాము కోరుకున్న సీటే దక్కుతుండటంతో గంటా శ్రీనివాసరావు అనుచరులు సంతోషంగా ఉన్నారు.