మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ… త్వరలో జనసేనలో చేరబోతున్నారా? కుటుంబ సభ్యులు, మిత్రులు, సొంత క్యాడర్ తో కలిసి బొత్స త్వరలో జనసేనలో చేరుతున్నట్లు సమాచారం.. దీనికి సంబంధించి ఒక కీలక వ్యక్తి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినట్లు తెలిసింది. తగిన సమయం చూసుకొని బొత్స జనసేనలో చేరనున్నారు. అటు కాపు సామాజిక వర్గం అండదండలు, సినిమా, పాలిటిక్స్ రంగాల్లో సీనియర్ల మద్దతు ఉండటంతో బొత్స రాక జనసేనకు కొత్త శక్తిని ఇస్తుందని అందరి అంచనా.
ఉత్తరాంధ్రలో బొత్స మార్కు రాజకీయమే వేరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎవరు అవునన్నా కాదన్నా బొత్స సత్యనారాయణ తనకంటూ ప్రత్యేక ఉనికి ఉన్న నాయకుడిగా ఎదిగారు. కింది స్థాయి నుంచి వచ్చినప్పటికీ విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలను చూపుడువేలుతో శాసించి గెలిపించగల శక్తి బొత్స కి ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు. ఆయన మాట్లాడే మాట సరిగ్గా ఎవరికీ అర్థం కాకపోయినా తన వ్యవహార శైలితో, దూకుడుతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలిగే సత్తిబాబు తెర వెనక వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట.1999 లో బొబ్బిలి కాంగ్రెస్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన సత్తిబాబు, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్లిష్టమైన రోజుల్లో పిసిసి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. వైయస్ కి అత్యంత సన్నిహితుడిగా బొత్స ముద్రపడ్డారు. విజయనగరం జిల్లాను మొత్తం రాజకీయంగా శాసించే స్థాయికి ఎదిగారు.2009లో ఆయన భార్య ఝాన్సీ కూడా విజయనగరం ఎంపీగా గెలిచారు.2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బొత్స కు ఓటమి తప్పలేదు. కానీ ఆయన వెంటనే తేరుకుని , వైసీపీలో చేరడంతో 2019లో తిరిగి మళ్లీ రాజకీయ వైభవం ప్రారంభమైంది. విజయనగరంలో 9 సీట్లకు 9 గెలిపించి సత్తా చాటారు బొత్స. జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. కానీ ఇటీవల ముగిసిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బొత్స కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. విశాఖ ఎంపీగా పోటీ చేసిన సత్తిబాబు భార్య ఝాన్సీ, గజపతినగరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన తమ్ముడు బొత్స అప్పలనాయుడు తో సహా చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స కూడా దారుణంగా ఓడిపోయారు.
ఈ దారుణ ఓటమితో సత్తిబాబు ఆలోచనలో పడ్డారు. అసలు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటే ఎలా ఉంటుంది..? లేదా పూర్తిగా నిష్క్రమిస్తే ఇంకెలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా బొత్స కుటుంబం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. నిజానికి బొత్స 2010లో జగన్ తో పాటు కాంగ్రెస్ నుంచి జగన్ తో పాటు ఆయన కోసం బయటకు రాలేదు. మొదట సత్తిబాబు బాహాటంగా జగన్ని వ్యతిరేకించారు. ప్రెస్ మీట్ లు పెట్టి జగన్ని తిట్టిన పెద్ద నాయకుల్లో బొత్స కూడా ఒకరు. అంతేకాదు మొదటినుంచి జగన్ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకుల్లో సత్తిబాబు కూడా ఉన్నారు. కానీ 2014 ఓటమి తర్వాత అయిష్టంగానే ఆయన మనుగడ కోసం వైసీపీలో చేరారు.2019లో జగన్ సర్కారు ఏర్పడ్డాక మొదటి రెండున్నర ఏళ్ళు బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన్ని ఇష్టం లేని విద్యాశాఖ మంత్రిగా మార్చారు జగన్. ఆ శాఖ తీసుకోవడానికి మొదట బొత్స సత్యనారాయణ నిరాకరించారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగారు. వైసీపీలో ఉన్న కాలమంతా విజయనగరం జిల్లానీ ఒంటి చేత్తో గెలిపించడం మినహా, సత్తిబాబు సీనియారిటీని… జగన్ ఎక్కడ వాడుకోలేదు. సరి కదా చాలాసార్లు అవమానించారు. అన్నిటికన్నా ఘోరం, దారుణం… ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జిగా కొన్నాళ్లు విజయసాయిరెడ్డిని, మరికొన్నాళ్లు సుబ్బారెడ్డిని నియమించడం.
ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడైన బొత్స కు పార్టీలో ఎంత కన్నా అవమానం ఏముంటది? వైసీపీలో రెడ్లకు మినహా ఏనాడు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులకు ప్రాధాన్యం దక్కలేదు. ఉత్తరాంధ్ర తో ఏ సంబంధం లేని విజయసాయిరెడ్డి అక్కడికి వచ్చి పార్టీ ఇన్చార్జిగా ఆదిపత్యం, అరాచకం చలాయిస్తుంటే బొత్స నోరెళ్లబెట్టి చూడాల్సి వచ్చింది. అంతేకాదు సత్తిబాబు స్వయంగా పెంచి పెద్ద చేసిన మేనల్లుడు మజ్జి శ్రీను అలియాస్ డాన్ శ్రీనునీ సాయిరెడ్డి బొత్స పైకి ఉసిగొలిపారు. సాయి రెడ్డిని తొలగించిన తర్వాత అయినా తనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తారని బొత్స భావించారు. సాయి రెడ్డి ప్లేస్ లోకి సుబ్బారెడ్డి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే బొత్సకు అర్థమైంది. జగన్ నడిపే రెడ్ల పార్టీలో తన స్థానం చాలా పరిమితమని. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తనకన్నా జూనియర్ అయినా అచ్చంనాయుడు… ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిపోయాడు, ఉమ్మడి రాష్ట్రానికి ఏకంగా పిసిసి అధ్యక్షుడిగా చేసిన తాను ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా కూడా పనికి రాలేదా…? అని ఆయన చాలాసార్లు బాధపడ్డారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న తాను రెడ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుందని బొత్స తన సన్నిహితుల దగ్గర వాపోయారు.
ప్రభుత్వంలో సంక్షోభాలు వచ్చినప్పుడు, వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే బొత్సని పిలిచి ప్రెస్ మీట్ లు పెట్టించడం మినహా జగన్ బొత్సనీ ఏనాడు గౌరవించింది లేదు. ఇవన్నీ దిగ మింగుకొని రాజకీయ మనుగడ కోసం వైసీపీలో ఉన్నారు బొత్స. రాజధానిగా విశాఖ సత్తిబాబు కు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ప్రభుత్వ, పార్టీ విధానాలను వ్యతిరేకించలేక తలాడించారు. చివరికి ఈ గబ్బులోంచి బయటపడాలని ఉద్దేశంతో తనను రాజ్యసభకు పంపించాలని జగన్ ని పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్ నిర్ద్వందంగా తిరస్కరించారు. బొత్స ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ఆదేశించారు. మొన్నటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణ జగన్ తెలివిగా ఇరికించారు. ఇష్టం లేకపోయినా, వద్దని ఎంత వారించినా వినకుండా బొత్స ఝాన్సీ ని విశాఖ ఎంపీగా నిలబెట్టారు జగన్.
బొత్స తీసుకెళ్లి చీపురుపల్లి ఎమ్మెల్యేగా నిలిపారు. భార్య ఝాన్సీ ని ఎంపీగా నిలబెట్టడం ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలతో బొత్స ఒప్పుకోవాల్సి వచ్చింది. చివరికి కానీ ఎరుగని ప్రజా వ్యతిరేకతతో ఝాన్సీ , సత్తిబాబు, అప్పలనాయుడు ఓడిపోయారు. విజయనగరం జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఎన్నడూ లేనంత పరాభవంతో కూచించకపోయిన బస్సు అసలు రాజకీయాలు వదిలేస్తే ఈ గొడవే ఉండదు కదా అనే ఆలోచనలో పడ్డారు. కానీ సన్నిహితులు, కాపు సామాజిక పెద్దలు బొత్స కి నచ్చ చెప్పారు. జనసేనలో ఎందుకు చేరకూడదు అనే ప్రశ్న లేవనెత్తారు. నిజానికి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో బొత్స కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. పేర్ని నాని, కొడాలి నాని ,రోజా లాగా విరగబడి జగన్ ఎప్పుడు తిట్టలేదు. అడపా దడపా…. అంశాలవారీగా విమర్శించేవారు.
చిరంజీవితో మొదసాకి మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. జగన్ కు మరో 10 ఏళ్లు భవిష్యత్తు కనిపించడం లేదు. బిజెపి జనసేన టిడిపి కనుక 2029 లోను కలిసి పోటీ చేస్తే మాత్రం జగన్ కి ఏపీలో అడ్రస్ ఉండదు. గడిచిన ఐదేళ్లపాటు రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నాను. మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో జగన్ వెంట ఉండడం అవసరమా ఉన్నారట బొత్స. బొత్స జనసేనలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారne సమాచారం చిరంజీవి కూడా చేరింది. బొత్స సత్తిబాబు టిడిపిలో చేరే పరిస్థితి యెన్నటికీ రాదు. తొలినాటి నుంచి బొత్స చంద్రబాబుకు బద్దవ్యతిరేకి.
ఇప్పుడు హఠాత్తుగా ఇన్నేళ్ల రాజకీయం తర్వాత టిడిపిలో టిడిపిలో చేరి చంద్రబాబు కాళ్లకు మొక్కాలంటే… బొత్స ఆ పని చేయలేడు. anthe కాదు కన్నా laxminarayana లాంటి వాళ్లు టిడిపి లో చేరి
జీరో ayipoyaaru. కనుక మంచో చెడో… జనసేన వైపు వెళ్లిపోవడమే మంచిదని ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం ఒత్తిడి కూడా బొత్స మీద ఎక్కువగానే ఉంది. ఒకరిద్దరు కాపు సామాజిక వర్గ ప్రముఖులు ఇప్పటికే చిరంజీవికి, బొత్స జనసేనలో చేరాలి అనుకుంటున్న సమాచారాన్ని లాంఛనంగా చెప్పారు.
ఇక త్వరలో బొత్స కుటుంబం మొదటి చిరంజీవిని కలిసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ ని ఒప్పించగలిగితే జనసేనలోకి బొత్స డైరెక్ట్ ఎంట్రీ అయిపోతారు. వైసీపీలో ఉండలేడు…. టిడిపిలో చేరలేడు. ఇక మంచో చెడో జనసేన లో చేరితే 2029 లో మళ్లీ అధికారంలోకి రావచ్చని ఆశ తో ఉన్నారు బొత్స. పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా సత్తిబాబు అంటే నచ్చదు. కనుక చిరంజీవి ద్వారా రాయబారం మొదలుపెట్టారు బొత్స అనుకూల నేతలు. అంతా అనుకున్నట్టు వర్క్ అవుట్ అయితే ఆరు నెలల్లో బొత్స జనసేన జెండా ఎత్తుకుంటారు.