Peddireddy : అడ్డంగా ఇరుక్కున్న పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే పదవి పోయినట్టే !

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి... పుంగనూరు ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

 

 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి… పుంగనూరు ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. మొత్తం 142 ఆస్తులను అఫిడవిట్ లో చూపించకుండా పెద్దిరెడ్డి దాచిపెట్టారని పిటిషన్ లో తెలిపారు. ఈ కేసుకు భయపడే మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో రికార్డుల్ని కాల్చేశారని టాక్.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో వీలైనన్ని ప్రభుత్వ భూముల్ని తన పేరుతో పాటు తన భార్య, ఇతర బినామాలకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఒక్కోటి బయట పడుతున్నాయి. వాటిల్లో 142 ఆస్తులను పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదు. అదే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టింది. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ 142 అసెట్స్ కి సంబంధించి పక్కా ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ కేసు విచారణ కీలక దశలో ఉంది. పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించేందుకు అన్ని సాక్ష్యాలు, ఆధారాలను పకడ్బందీగా సేకరించిన తర్వాతే రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు. దాంతో పెద్దిరెడ్డి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా… పుంగనూరు ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం అంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ళ దహనానికి కారణం కూడా ఈ కేసే అంటున్నారు. అధికారులు కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేయకుండా అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దారెడ్డికి వర్కవుట్ కాలేదు. అందుకే రికార్డులు తగలబెట్టించినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మదనపల్లి అగ్నిప్రమాదం ఘటనను సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకోవడంతో… రేపో మాపో పెద్దిరెడ్డి మెడకు ఆ కేసు కూడా చుట్టుకునే అవకాశముంది. ఇప్పటికే భూముల ఆక్రమణ కేసులతో పాటు… ఎమ్మెల్యే అనర్హత కత్తి పెద్దిరెడ్డి మెడకు వేలాడుతున్నాయి. ఉన్న ఎమ్మెల్యే గిరి కూడా పోతే పెద్దిరెడ్డి కట కటాలు లెక్కపెట్టడం ఖాయం. అనర్హత వేటు పడితే… పుంగనూరు ఎమ్మెల్యేగా తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. కానీ ఇలాంటి ఎమ్మెల్యేల అనర్హత కేసులు గతంలో ఐదేళ్ళ పాటు నడిచిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి కేసైనా తొందరగా విచారణ జరుగుతుందా … అనర్హత వేటు పడుతుందా అన్నది చూడాలి.