VARMA KI HAND : వర్మకు హ్యాండిచ్చారా ? ఎమ్మెల్సీ లేదా… మంత్రి పదవి ఇవ్వరా…

పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ.. అప్పట్లో ఆయన విధేయులంతా రోడ్డెక్కి ధర్నాలు చేశారు.

పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ.. అప్పట్లో ఆయన విధేయులంతా రోడ్డెక్కి ధర్నాలు చేశారు. పిఠాపురంలో టీడీపీ ఆఫీసు ఫర్నిచర్ తగలబెట్టారు కూడా. అయితే చంద్రబాబు జోక్యం చేసుకొని వర్మని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి ఒప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడంలో వర్మ పాత్ర కూడా కీలకం. అలాంటిది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఆయన పేరు లేదు. గతంలో ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీలకు కూటమి అభ్యర్థులుగా సి.రామచంద్రయ్యతో పాటు హరిప్రసాద్ కు అవకాశం ఇచ్చారు సీఎం చంద్రబాబు. తాను వైసీపీకి రిజైన్ చేయడంతో ఖాళీ అయిన స్థానంలోనే సీ.రామచంద్రయ్యకు మళ్ళీ ఛాన్సిచ్చారు. అయితే పవన్ కల్యాణ్ పొలిటికల్ అడ్వైజర్ హరిప్రసాద్ కు ఇంకో సీటు ఇచ్చారు. దాంతో వర్మకు మొండి చెయ్యే మిగిలింది. పిఠాపురంలో పవన్ పోటీ చేయకుండా ఉంటే… వర్మకే టీడీపీ టిక్కెట్ దక్కేది. ఆ సీటు త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చి… ఇప్పుడు అన్యాయం చేస్తారా అని వర్మ వర్గీయులు మండిపడుతున్నారు. పవన్ కూడా యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ కి అలవాటు పడ్డారని ఆరోపిస్తున్నారు.

అయితే స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు తప్ప… మండలికి జరిగే మిగతా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్సుంది. అందుకే వర్మను ఇప్పుడు కాకపోయినా… మరోసారి ఎన్నిక చేస్తారన్నవాదన టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇవ్వలేదని వర్మ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.