AP Free sand : నేటి నుంచి 20 జిల్లాల్లో ఉచితంగా ఇసుక అమలు.. ఇలా బుకింగ్ చేసుకోండి..

ఏపీలో ఇవాళ్టి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి ప్రారంభం అయ్యింది.

ఏపీలో ఇవాళ్టి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. నేపథ్యంలో..సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు నేరుగా స్టాక్‌ పాయింట్ల దగ్గరికి వెళ్లి ఇసుకను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు ఇసుక తవ్వకాలు, సీనరేజ్‌, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను చెల్లించాల్సి ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న స్టాక్‌ పాయింట్ల దగ్గర సోమవారం నుంచి ఈ ఉచిత ఇసుక విధానం అమలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా, మిగతా 20జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వకేంద్రాల వద్ద ఈ ఉచిత ఇసుక విధానం అమలు కానుంది.

ఉచితంగా ఇసుక.. ఇలా బుక్ చేసుకోండి!

రాష్ట్రంలో నేటి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్నిచోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూ.20, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. సగటున రోజుకు ఒక వినియోగదారుడికి 20 టన్నులే పంపిణీ చేస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.