AP Unemployed, DSC : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పాత DSC రద్దు..! కొత్త మెగా డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగించుకుని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ కు నాలుగో సారి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సీఎం బాధ్యతలు కూడా స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగించుకుని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ కు నాలుగో సారి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సీఎం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు తొలి సంతకం.. మెగా డీఎస్సీ పై పేడతాతని హామీ ఇచ్చిన విషయంత తెలిసిందే.. అందులో బాగంగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

  • పాత DSC రద్దు..

కాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • డీఎస్పీకి అర్హులు..

డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కుల నిబంధన ఉండేది. కాగా భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది.

  • మెగా DSC మొత్తం ఖాళీలు 16,347

 

  • సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులు: 6,371
  • పీఈటీ పోస్టులు: 132
  • స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు: 7725
  • టీజీటీ పోస్టులు: 1781
  • పీజీటీ పోస్టులు: 286
  • ప్రిన్సిపల్స్‌ పోస్టులు: 52

 

  • మెగా డీఎస్పీ పేరుతో చంద్రబాబు మోసం : YCP

టీచర్ పోస్టులు :

నాగబాబు 35 వేల ఖాళీలు ఉన్నాయి అన్నారు. టీడీపీ 25 వేల ఖాళీలు ఉన్నాయి అంది. మరి గత ప్రభుత్వం ప్రతిపాదించిన వాటికంటే తక్కువ పోస్టులు భర్తీకి తొలిసంతకం.. 21వేలకు పైగా ఉన్న దగ్గర 16 వేల పోస్టుల భర్తీ అంటూ మెగా అనడం దగా కాదా..  మెగా అంటే గతం కంటే ఎక్కువ అనగా.. 30 నుంచి 50వేల పోస్టులు ఉండాలి. అంటూ సోషల్ మీడియాలో YCP పోస్ట్ లు..

మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు మెగా మోసం చేశారన్న YCP విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘ఐదేళ్లు మెగా డీఎస్సీ అని ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని నువ్వు ఎక్కడ? వచ్చిన మొదటి రోజే 16వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడ?’ అని Xలో రిప్లై ఇచ్చింది. కాగా, 25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు.. 16,347 పోస్టులే ఇచ్చారని అంతకుముందు వైసీపీ ట్వీట్ చేసింది.