తెలంగాణలో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon), ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాయి.. అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పట్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది.