Weather Update : తెలంగాణ, ఏపీకి లో మోస్తారు వర్షాలు.. జిల్లాల్లో భారీ వర్షాలు..

నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

తెలంగాణలో రెయిన్ అలర్ట్..

తెలంగాణలో కూడా నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నేడు హైదరాబాద్, వికారబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్,నిర్మల్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిజామామాద్, జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక రేపు ఎల్లుండి.. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి .. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు.