Weather Report : రాష్ట్రంలో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు..

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు.

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటన చేసింది. సోమవారం మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం తేలికపాటి, మంగళ, బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

ఇవాళ మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక నిన్న ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.