‌Heritage Income : అమాంతరం పెరిగిన హెరిటేజ్ షేర్లు.. లోకేష్, భువనేశ్వరికి వందల కోట్ల ఆదాయం

ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) కి ఫుల్ మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటమే కాకుండా... అటు కేంద్రంలోనూ టీడీపీ కింగ్ మేకర్ గా మారింది.

 

 

ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) కి ఫుల్ మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటమే కాకుండా… అటు కేంద్రంలోనూ టీడీపీ కింగ్ మేకర్ గా మారింది. ఈనెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. దాంతో చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లో అమాంతం పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా లాభాలు వచ్చాయి.
జూన్ 3న అంటే ఎలక్షన్ కౌంటింగ్ కి ముందు రోజు హెరిటేజ్ ఫుడ్స్ 424 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. శుక్రవారం నాడు అదే షేర్ 661 రూపాయల 25 పైసల దగ్గర ట్రేడ్ అయి సంచలన సృష్టించింది. అంటే ఐదు రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం పెరిగాయి. హెరిటేజ్ లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటాలు ఉన్నాయి. వీటిల్లో భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంటే, నారా లోకేష‌ కు 10.81 శాతం ఉంది. ఇంకా కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం, మనువడు దేవాన్ష్ కు హెరిటేజ్ డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటాలు ఉన్నాయి.

ఈనెల 7 న హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 10శాతం పెరిగి… 661 రూపాయల 25 పైసల దగ్గర ముగిశాయి. దాంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో 535 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక లోకేష్ 237 కోట్లు సంపాదించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం వల్లే హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యూ అమాంతరం పెరిగింది. నెల రోజుల్లో 81శాతం, ఏడాదిలో చూస్తే 190శాతం హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు పెరిగాయి. దీంతో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా భారీగా లాభాలను అందుకున్నారు.

ఏపీలో టీడీపీ గెలుపు, NDAకు చంద్రబాబు మద్దతు ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఊపందుకున్నాయి. బీజేపీకి సొంతంగా మేజిక్ ఫిగర్ రాకపోవడంతో బుధవారం నాడు స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు కనిపించాయి. ఆ తర్వాత చంద్రబాబు NDA కి సపోర్ట్ ఇస్తామని ప్రకటించడంతో ఒక్కసారి షేర్ల విలువలు పెరిగాయి. స్టాక్ మార్కెట్ లాభాల బాట నడిచింది.