విజయవాడలో (Vijayawada) ఇవాళ జనసేన టీడీపీ నేతల సభాపక్ష నేతలను ఎన్నుకునే కార్యక్రమం జరిగింది. జనసేన (Janasena) ఫ్లోర్ లీడర్‌గా పవన్, టీడీపీ (TDP) ఫ్లోర్ లీడర్‌గా చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. తరువాత ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్న చంద్రబాబు (Chandrababu) ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతుండగా ఓ ఎమోషనల్ సీన్ కనిపిచింది. చంద్రబాబును ఒక్కసారి చూస్తాను అంటూ ఓ మహిళ ఆయన కాన్వాయ్ వెంట పరిగెత్తింది. అధికారులు ఎంత చెప్పినా వినకుండా పరుగు తీస్తూనే ఉంది.
ఆ మహిళను గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపారు. అధికారులను వారించి మరీ మహిళను దగ్గరికి పిల్చుకున్నారు. తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనది మదనపల్లి అని వాళ్ల ఊర్లో టీడీపీకి ఓట్లు వేయించేందుకు చాలా కష్టపడ్డాను అని చెప్పింది. చంద్రబాబుపై అభిమానంతో తన చేతిపై వేయించుకున్న ఆయన పేరును చూపించింది. తన ప్రియతమ నాయకున్ని దగ్గరగా చూస్తూ మురిసిపోయింది. ఆ అభిమాని మాటలకు సంతోషించిన చంద్రబాబు ఆమెతో కాసేపు మాట్లాడారు.
ఆ మహిళ కాళ్లు పట్టుకుంటాను అని కోరితే సున్నితంగా తిరస్కరించి మహిళను ఆశీర్వదించారు. మహళకు జ్వరం ఉన్నా చేతికి సెలైన్ నీడిల్‌తోనే కాన్వాయ్ వెంట పరిగెత్తింది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించాలంటూ తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు చంద్రబాబు. ఆర్థికంగా కూడా ఆమెకు అవసరమైన సాయం చేయాలంటూ స్థానిక నేతలను ఆదేశించారు. ఒళ్లు కాలిపోతున్నా అభిమాన నాయకున్ని కలిసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి అక్కడున్న ప్రతీ ఒక్కరూ ఫిదా ఐపోయారు.