YS Jagan : జగన్‌కు ఐఏఎస్‌ల వెన్నుపోటు! ఆ అధికారి రిటైర్మెంట్ పార్టీలో ఏం జరిగిందంటే..

అప్పుడు.. ఇప్పుడు జగన్‌ను నమ్ముకొని నిండా మునిగిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎందరో ! వైఎస్ కింద పనిచేస్తూ.. అప్పట్లో జగన్‌కు కోసం పనిచేసిన ఐఏఎస్‌లు.. జైలు ఊచలు లెక్కపెట్టారు.

 

 

అప్పుడు.. ఇప్పుడు జగన్‌ను నమ్ముకొని నిండా మునిగిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎందరో ! వైఎస్ కింద పనిచేస్తూ.. అప్పట్లో జగన్‌కు కోసం పనిచేసిన ఐఏఎస్‌లు.. జైలు ఊచలు లెక్కపెట్టారు. అవినీతి చేరి.. కేసుల్లో ఇరుక్కొని.. ఇంటా బయట తిట్లు తిన్నారు. శ్రీలక్ష్మీ, బీపీ ఆచార్యలాంటి ఐఏఎస్‌ అధికారుల కెరీర్‌కు.. ఇప్పటికీ అది మాయని మచ్చలా ఉంది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ఎన్నికయిన తర్వాత.. ఆయనను నమ్ముకున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయింది. జగన్‌ సన్నిహితులుగా పేరు ఉన్న అధికారులను మొహం చూసేందుకు కూడా.. సీఎం చంద్రబాబు ఇష్టపడడం లేదు. వచ్చీ రాగానే ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఐఏఎస్‌ శ్రీలక్ష్మీకి ఎదురైన అవమానం అయితే మరీ దారుణం. బొకే తీసుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడకపోగా.. మంత్రి నారాయణ అయితే ఆమె ఇచ్చిన ఫైల్ మీద సంతకం చేయనని మొహం మీదే చెప్పేశారు.

ఇక ఇంటెలిజెన్స్ చీఫ్‌ రామాంజనేయులు పరిస్థితి మరీ ఘోరం. చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూడగా.. ఆయన కింది అధికారితో చెప్పించి మరీ రామాంజనేయులును పంపించేశారు చంద్రబాబు. జగన్ సర్కార్‌లో వీళ్లంతా తీవ్ర అవినీతికి పాల్పడినట్లు.. చంద్రబాబు సర్కార్ ఫిక్స్ అయింది. ఒక్కొక్కరి బాగోతం బయటకు తీసేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో.. జగన్‌కు ఐఏఎస్‌, ఐఏపీఎస్‌లు ఒక్కొక్కరుగా ఝలక్ ఇవ్వబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జగన్ హయాంలో సీఎంవోలో కీలకంగా పనిచేసిన ధనుంజయరెడ్డి రిటైర్మెంట్ పార్టీలో జరిగిన సంఘటన.. దీనికి మరింత బలం చేకూరుస్తోంది. జగన్‌కు ధనుంజయరెడ్డి నమ్మినబంటులాంటి వారు. ఆయన ఈ మధ్యే రిటైర్ అయ్యారు. తోటి ఉద్యోగులకు ఆయన పార్టీ ఇవ్వగా.. జగన్‌కు అనుకూలంగా ఉన్న ఐఏఎస్‌, ఐఏపీఎస్‌లందరూ ఆ పార్టీకి అటెండ్ అయ్యారు.

ఐతే ఆ పార్టీలో అధికారుల మధ్య ఆసక్తికరక సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తప్పులు జగన్ చేస్తే.. నిందలు తమ మీద వేస్తున్నారని.. ధనుంజయ రెడ్డితో సహా.. జగన్‌కు సన్నిహితులుగా పేరున్న రామాంజనేయులుతో పాటు మరో ఐఏఎస్ అధికారి కూడా.. ఆవేదన వ్యక్తం చేశారట. ఈ పార్టీకి హాజరయిన సజ్జల కూడా.. తప్పంతా జగన్‌దే అన్నట్లు వారి మాటలకు వంత పలికినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన అధికారులు కూడా ఇలాంటి ఆవేదనే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తప్పులున్నీ జగనే చేశాడని.. తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఒకరితో ఒకరు అధికారులు ఆ పార్టీలో ముచ్చటించుకున్నారట. జగన్ తప్పు చేస్తే.. అందరూ తమను వేధిస్తున్నారని.. ట్రాన్స్‌ఫర్‌లు, జరుగుతున్న పరిణామాలను చూసి కాస్త ఆవేదన కూడా వ్యక్తం చేసినట్లు టాక్.

ఇలా ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకుంటూ.. జగన్ చేసిన వాటితో ఎలాంటి సంబంధం లేదని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారట. జగన్ చెప్తేనే చేశామని.. అలాంటిది ఇప్పుడు మీడియాలో పార్టీల్లో.. తమ గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటున్నారని.. తమని క్రిమినల్స్‌లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. సీఎం ఎలా చెప్తే మనం అలా చేయాలి కానీ.. ఆయనకు వ్యతిరేకంగా చేయాలంటే కష్టం కదా.. ఆయన జగన్ ఏమైనా అమాయకుడా.. ఆయన ఏం చెప్తే అది అదే చేశాం.. అంటూ ఇలా రకరకాల వివరణలు ఇచ్చుకున్నారంటా.