Janasena Uday Srinivas : దుబాయ్‌లో తరిమేస్తే ఇండియాలో పడ్డాడు.. అడ్డగోలు దందాలు.. అవినీతి బాగోతాలు..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్.

 

 

జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ లీలలు అన్నీ ఇన్నీ కావు..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్. ఇప్పటికే ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయ్. దీంతో ఉదయ్ వ్యవహారం.. జనసేన (Janasena) ను మరింత టెన్షన్ పెడుతోంది. తాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Engineering) చదవానని.. రాజకీయాల్లోకి రావడానికి ముందు.. దుబాయ్‌ (Dubai) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసినట్లు ఉదయ్‌ ప్రచారం చేసుకున్నాడు.

ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం చేసుకున్నట్లు డప్పు కొట్టాడు. కట్‌ చేస్తే.. అఫిడవిట్‌లో మాత్రం ఇంకోలా చేర్చాడు. తన విద్యార్హత ఇంటర్ అని నమోదు చేయడం ఇప్పుడు కొత్త రచ్చకు కారణం అవుతోంది. ఇంటర్మీడియట్ చదివిన నీకు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎవరిచ్చారు అంటూ వైసీపీ నేతలు సోషల్‌ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇంటర్మీడియట్‌ (Intermediate) తో దుబాయ్‌లో ఉద్యోగాలు అంటే.. ఏ పెట్రోల్‌ బంక్‌లో.. పెట్రోల్ కొట్టే ఉద్యోగం తప్ప.. సాఫ్ట్‌వేర్ జాబ్ ఎవడిస్తాడు అంటూ నిలదీస్తున్నారు. చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్‌లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధ్యమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏమైనా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది.

ఇది వైసీపీ (YCP) కి మరో ఆయుధంగా మారింది. అధికార పార్టీ నేతలు.. ఉదయ్ బాగోతాలను మరింత లోతుగా తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్ చదివిన వ్యక్తి.. ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు అని ఆరా తీసే పనిలో ఉన్నారు. ఉదయ్ అక్రమాల పుట్టను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీ టైమ్ ఉదయ్‌ బాగోతాలు, నేర చరిత్ర ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. రాసుకుంటూ పోవాలే కానీ.. ఉదయ్ వేషాలు మాములుగా లేవ్‌. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. కోట్లకు పడగలెత్తి.. ఇప్పుడు ఏకంగా కాకినాడలాంటి స్థానం నుంచి ఎంపీ టికెట్ దక్కించుకునేంత వరకు ఎదగడంతో.. ఉదయ్ చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కింది నుంచి వచ్చామని పదేపదే చేసుకున్న ప్రచారమే.. ఉదయ్‌కు ఎంపీ టికెట్ దక్కేలా చేసిందనే టాక్ ఉంది. కష్టపడి పైకి వచ్చాడు కదా అని పవన్‌ కూడా.. ఉదయ్‌కు మద్దతుగా నిలిచాడు.

ఐతే ఉదయ్‌ గతచరిత్ర మాత్రం టోటల్‌ డిఫరెంట్‌ ! నిజానికి దుబాయ్‌లో ఉదయ్ శ్రీనివాస్.. చేసింది సాఫ్ట్‌వేర్ జాబ్‌ కాదు. క్రికెట్ బుకీ నిర్వహించేవాడట. అక్కడి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన ఉదయ్‌పై.. దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చిలో కేసు నమోదు చేసింది కూడా ! అతని కోసం లుకౌట్‌ నోటీసు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ నోటీసు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో.. వాటినుంచి తప్పించుకొని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్.. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అని బిల్డప్ ఇచ్చాడు. ఈ ఆధారాలన్నీ సేకరించిన రాజకీయ ప్రత్యర్థులు.. ఎన్నికల ప్రచారంలో వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

దుబాయ్‌లోనే కాదు.. ఇండియాలోనూ ఉదయ్‌ మీద అవినీతి చిట్టా భారీగానే ఉందని అంటున్నారు. రెండు పాన్ కార్డులు తీసుకొని.. వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణ ఉంది. భూకబ్జా కేసు కూడా ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. దీంతో ఇలాంటి అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసా అన్న ప్రచారం ఆయన ప్రత్యర్థులు చేస్తున్నారు. వైసీపీ పార్టీ ఇదే అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా మల్చుకొని వాటిని ఉదయ్ శ్రీనివాస్‌పై ప్రయోగించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఉదయ్‌ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ అవినీతి బాగోతంతా.. ఎన్నికలపై భారీ ప్రభావం చూపించే చాన్స్ ఉంటుందని.. ఉదయ్‌కు కష్టమే అంటూ మరికొందరు అంటున్నారు.