Inter Colleges : నేటి నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం…

నేటి నుంచి తెలుగురాష్ట్రాల్లో ఇంటర్ కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. నిన్నటితో కాలేజీలకు వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణలో మొత్తం 3,269కాలేజీలు ఉండగా.. నిన్నటివరకు 2,483కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది.

నేటి నుంచి తెలుగురాష్ట్రాల్లో ఇంటర్ కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. నిన్నటితో కాలేజీలకు వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణలో మొత్తం 3,269కాలేజీలు ఉండగా.. నిన్నటివరకు 2,483కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో 1,443 ప్రైవేటుకాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్డ్ ఆక్యూపెన్సీ భవనాల్లో ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో ఆయా కాలేజీల్లోని సెకండియర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెల కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 15 నుంచి ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభంకానున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు జూన్‌ 14 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని.

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు మార్చి 31 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 31తో సెలవులు ముగిశాయి. దీంతో నేడు జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం అయ్యాయి. కాగా ఈనెల (జూన్‌) నెల 30వ తేదీలోపు ప్రవేశాలు పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్ధులు ప్రవేశాలు పొందాలని తెలియజేస్తూ.. వాటి జాబితాను ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్లలో http://www.acadtsbie.cgg.gov.in/ లేదా https://tsbie.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవల్సిందిగా బోర్డు సూచించింది.