IPACK PACKUP : ఏపీలో ఐప్యాక్ దుకాణం బంద్.. పేటీఎం బ్యాచ్ కి వైసీపీ అన్ని కోట్లా ?

ఈసారి ఏపీ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించింది. అన్ని పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసి... అందులో సిబ్బందిని రిక్రూట్ చేసుకొని నడిపించాయి.

ఈసారి ఏపీ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించింది. అన్ని పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసి… అందులో సిబ్బందిని రిక్రూట్ చేసుకొని నడిపించాయి. వైసీపీ సోషల్ మీడియా అయితే 6 నెలల ముందు నుంచే చెలరేగిపోయింది. ఈ విభాగాన్ని సజ్జల కొడుకు భార్గవ రెడ్డికి అప్పగించారు సీఎం జగన్. ఇది కాకుండా ఐప్యాక్ టీమ్ కూడా పనిచేసింది. ఎన్నికలు ముగిశాక.. ఇప్పుడు ఈ రెండు సంస్థల యాక్టివిటీస్ బంద్ అయ్యాయి. ఐప్యాక్ టీమ్ మెంబర్స్ కి సెలవులు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ పోలింగ్ అయిన తెల్లారే ఐప్యాక్ కి వైసీపీ గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. రుషి రాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ టీమ్ పనిచేసింది. వీళ్ళు కాకుండా వైసీపీ సొంతంగా నడిపిన సోషల్ మీడియాలో 150 మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు. సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిన ఈ టీమ్ ని కూడా ఇళ్ళకి పంపేశారు.

జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా సెలవులు ఇచ్చారని చెబుతున్నారు. కానీ ఇక వాళ్ళందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించినట్టే అని తెలుస్తోంది. వీళ్ళకి ఇంకా జీతాలు కూడా రావాల్సి ఉంది. పైగా ఈ నెల రోజులు సెలవులు ఇచ్చినందున… ఈ జీతాలు కూడా వస్తాయో రావో తెలీదు. ఐప్యాక్ టీమ్… ఈ ఎన్నికల కోసం కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లను డీల్ చేసింది. డబ్బులు ఎంతైనా సరే అంటూ… విచ్చలివిడిగా వీళ్ళని కొనుగోలు చేసింది.

వైసీపీ తరపున వాళ్ళతో ప్రచారం చేయించడం… ట్వీట్స్, మెస్సేజ్ లు పెట్టించడం లాంటి పనులు చేశారు. నెటిజన్స్ వీళ్ళనే పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ఈ పేటీఎం బ్యాచ్ కోసం వైసీపీ ఏకంగా 50 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. వీళ్ళ ప్రచారం వైసీపీ అంతగా ఉపయోగపడకపోగా… నెగిటివ్ అయిందని అంటున్నారు. అందుకే 50 కోట్ల రూపాయలు ఇవ్వడానికి జగన్ నిరాకరించారట. కానీ వైఎస్ భారతి చివరకు సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్లకు ఎంతో కొంత ఇచ్చి డీల్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో మళ్ళీ వైసీపీ వస్తే ఓకే. లేకపోతే టీడీపీ కూటమి అధికారం చేపడితే వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే సిబ్బందికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే ఇప్పుడే తమ జీతాలు సెటిల్ చేస్తే బయటపడాలని చూస్తున్నారట ఉద్యోగులు.