Jagan safe game : జగన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా ? ఏపీలో షర్మిలకు చెక్ తప్పదా..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్ట్స్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా ... ఇండియా కూటమితో జత కలుస్తారా... అన్నది సస్పెన్స్ గా మారింది.

 

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్ట్స్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా … ఇండియా కూటమితో జత కలుస్తారా… అన్నది సస్పెన్స్ గా మారింది. గతంలో ఎన్డీఏ, ఇండియా కూటమికి సమదూరం పాటిస్తున్నట్టు బయటకు చెప్పుకున్నా… NDA అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక… ఆయన ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్టు కనిపిస్తున్నారు. అయితే నిజంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో కలసి వైసీపీ పనిచేస్తుందా అన్నది డౌటే. బయట ఇండియా కూటమి మద్దతు కోరుతూ… పార్లమెంటులో బీజేపీతో ఉన్న అవసరాన్ని బట్టి NDA కి సపోర్ట్ చేస్తారని అంటున్నారు పార్టీ లీడర్లు. డబుల్ స్టాండ్ తో జగన్ సేఫ్ గా బయటపడొచ్చని ప్లాన్ వేశారని అనుకుంటున్నారు. కానీ డబుల్ గేమ్ చాలా డేంజరే. ఏదో ఒక కూటమితో జత కట్టకపోతే… రాబోయే రోజుల్లో జగన్ చిక్కుల్లో పడితే ఏ కూటమి సపోర్ట్ దొరకదు.

ఇక కాంగ్రెస్ తో జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిన తర్వాత… బెంగళూరుకి వెళ్ళిన జగన్… అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రహస్యంగా భేటీ అయినట్టు వార్తలొచ్చాయి. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చినట్టు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు కూడా చేశారు. కానీ తర్వాత డీకే ఈ ప్రచారాన్ని ఖండించారు. కాంగ్రెస్ లో వైసీపీ విలీనం చేసే అవకాశం లేదనే తెలుస్తోంది. కానీ ఏపీలో రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతున్న పీసీసీ అధ్యక్షురాలు, తన చెల్లెలు షర్మిలను జగన్ టార్గెట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇండియా కూటమిలోకి వైసీపిని పిలుస్తున్నప్పుడు … ఏపీ పీసీసీ ఎలా టార్గెట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు… పీసీసీ చీఫ్ గా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ నేతల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో ఒకటో రెండో సీట్లయినా షర్మిల తెస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆశ పడింది. అది జరక్కపోగా… ఆమెతో విభేదించి… కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీకి దూరమవుతున్నారు. ఏపీలో జగన్ ని కలుపుకుపోవాలంటే… షర్మిలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది. షర్మిల విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ ఇండియా కూటమితో కలిసేది… లేదని తేలితే.. అప్పుడు షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని అంటున్నారు.