AP Election Polling : వైసీపీకి ఓటమేనా.. ఇండియాటుడే చెప్తే నిజమేనా.. ఆ సంస్థకు అంత సీన్ ఉందా.. నమ్మొచ్చా?

పోలింగ్‌ (Polling) కొంచెం కన్ఫ్యూజ్ చేసింది అంటే.. ఎగ్జిట్‌పోల్స్ (Exit Polls) ఏపీ ఓటర్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయ్. కొన్ని కూటమికి అనుకూలంగా.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటపెట్టాయ్‌.

 

 

పోలింగ్‌ (Polling) కొంచెం కన్ఫ్యూజ్ చేసింది అంటే.. ఎగ్జిట్‌పోల్స్ (Exit Polls) ఏపీ ఓటర్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయ్. కొన్ని కూటమికి అనుకూలంగా.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటపెట్టాయ్‌. ఐతే కూటమితో కంపేర్ చేస్తే.. వైసీపీ (YCP) కి ఫేవర్‌గా వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ చాలా తక్కువ. ఎన్ని సర్వేలు వచ్చినా.. ఎన్ని అంచనాలు వినిపించినా.. ఇండియాటుడే (India Today) మై యాక్సిస్ ఎగ్జిట్‌పోల్‌ కోసం అందరూ వెయిట్ చేశారు. ఇండియా టుడే చెప్పిందంటే.. దాదాపు అదే ఫైనల్ ఫలితం అనే రేంజ్‌లో ఎదురుచూశారు. ఐతే వైసీపీకి ఘోర పరాభవం తప్పదని.. కూటమిదే విజయం అన్నట్లుగా ఇండియాటుడే సంస్థ.. ఎగ్జిట్‌పోల్ ఇచ్చింది. మరి ఫలితాల్లో ఇదే రిఫ్లెక్ట్ అవుతుందా.. ఈ అంచనాలే నిజం అవుతాయా..
అసలు ఇండియాటుడే సంస్థకు అంత సీన్ ఉందా అని చర్చిస్తూ.. గతాన్ని తవ్వేస్తున్నారు కొందరు. ఏపీలో వైసీపీకి 2 నుంచి 4 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని.. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ తేల్చేసింది. ఈ సంస్థ ఫలితాల్లో క్రెడిబిలిటీ ఎంత అనే ప్రశ్నకు.. ఇంట్రస్టింగ్ ఆన్సర్లు వినిపిస్తున్నాయ్. ఈ సంస్థ ఫలితాలు మెజారిటీ సందర్భాల్లో నిజం కాలేదని.. కామెంట్లు వినిపిస్తున్నాయ్. 2023లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే అధికారం అని ఈ సంస్థ ఎగ్జిట్‌పోల్ ఇచ్చింది. ఐతే అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక రాజస్థాన్‌లోనూ సేమ్ సీన్‌. అక్కడ కూడా కాంగ్రెస్‌దే అధికారం అని ఇండియాటుడే సంస్థ చెప్పగా.. బీజేపీ గెలిచింది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే.. 2021లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ (BJP) దే అధికారమని ఆ సంస్థ తేల్చింది. కట్ చేస్తే టీఎంసీ అధికారంలోకి వచ్చింది.

ఇలా ఇండియా టుడే సర్వే లెక్కలన్నీ చాలావరకు తప్పుల తడకే అని.. కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు కూడా అదే జరగబోతోందని మరికొందరు అంటున్నారు. దానికి లాజిక్ కూడా చెప్తున్నారు. రాయలసీమలోని మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైసీపీదే విజయమని తేలిపోయిందని.. అలాంటిది 2 నుంచి 4 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేయడం.. అమాయకత్వమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంస్థ నిజంగానే సర్వే చేసిందా.. సర్వే చేస్తే ఎన్ని శాంపిల్స్ సేకరించింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. మరి ఓవరాల్‌గా ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.