బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ అరెస్ట్

అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల పైన విజయవాడ సీపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

  • Written By:
  • Updated On - November 2, 2024 / 12:43 PM IST

అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల పైన విజయవాడ సీపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. అత్యాచార బాధితులు పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు ఆమె. ఏదైనా రేప్ జరిగితే వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని… ఆ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారాన్ని గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ నిస్సిగ్గుగా బయటికి చెప్పాడని మండిపడ్డారు.

రేప్ గురైన బాధితుల పేర్లు చెప్పి మాట్లాడడం దుర్మార్గమన్నారు. మహిళల మీద, అత్యాచార బాధితుల పట్ల సోయలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. రేప్ గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అలాంటి వారి మీద ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేయాలని సీపీ ఫిర్యాదు చేశానన్నారు ఆమె. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వాళ్ల పార్టీకి చెందిన చానల్స్ వార్తలు ప్రసారం చేయడం, ఇప్పటికీ తొలగించకపోవడం చూస్తే.. మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న నిబద్దత ఏంటో అర్థం అవుతుందని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ వారికి కూడా ఫిర్యాదు చేసానన్న ఆమె… రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తాను అన్నారు. నాకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మాకు ఆప్తులని… త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానన్నారు.