AP Politics Jagan : ఇండియా కూటమిలోకి వైసీపీ.. క్లారిటీ ఇచ్చేసిన జగన్‌..

ఢిల్లీ ధర్నా.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపునకు కారణం అవుతోంది. ఐదేళ్లకు పైగా బీజేపీతో రహస్య బంధం మెయింటేన్ చేసిన జగన్..

ఢిల్లీ ధర్నా.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపునకు కారణం అవుతోంది. ఐదేళ్లకు పైగా బీజేపీతో రహస్య బంధం మెయింటేన్ చేసిన జగన్.. టీడీపీ, జనసేనతో కలిసి కమలం పార్టీ కూటమిగా ఏర్పడడంతో తన దారి తాను చూసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా.. కాంగ్రెస్‌తోనే మళ్లీ జగన్ ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయా అని జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని.. ఢిల్లీలో జగన్ ధర్నా చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరు హాజరుకాకపోయినా.. ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు దాదాపుగా జగన్‌కు మద్దతుగా నిలిచాయ్. ఐతే తమకు మద్దతుగా నిలిచిన పార్టీలకు.. తాము అండగా ఉంటామని జగన్‌ క్లియర్‌కట్‌గా చెప్పేశారు.

దీంతో 30న ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా కూటమి నిరసనకు.. వైసీపీ హాజరవుతుందా లేదా అనే ఆసక్తి కనిపిస్తోంది. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినా.. ఆయనపై దయ చూపడంలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం తీరుకి వ్యతిరేకంగా 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు రెడీ అయ్యారు. జగన్ ధర్నాకు ఆప్ నేతలు మద్దతు పలికారు. దీంతో ఆప్ ఆందోళనలో వైసీపీ పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలి. ఐతే తమ ధర్నాకు రాకపోవడంపై.. కాంగ్రెస్ నేతలే క్లారిటీ ఇవ్వాలంటూ.. జగన్ ఓ ప్రశ్న సంధించారు. ఎందుకు రాలేదని నిలదీశారు. అంటే ఆ పార్టీ ముందుకు వస్తే.. తాను కూడా చేతిలో చేయేసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పకనే చెప్పారా.. క్లారిటీ ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది.

నిజానికి ఇప్పుడు నేషనల్‌ లెవల్‌లో జగన్‌కు ఓ పార్టీ సపోర్టు అవసరం. తన ప్రత్యర్థితో కలిసి ఉంది కాబట్టి.. బీజేపీతో ట్రావెల్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న ఏకైక ఆప్షన్.. ఇండియా కూటమి. జగన్ నిర్ణయం ఆ దిశగానే ఉండే చాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నిజంగా జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా అంటే.. 30న ఇండియా కూటమి ఆందోళనలో జరగబోయే పరిణామాలు… చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే చాన్స్ ఉంది.