AP Assembly : అసెంబ్లీలో వెనక సీటులోనే జగన్‌.. తేల్చేసిన స్పీకర్‌.. ఎమోషనల్ డ్యామేజ్‌!

ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయ్. ప్రతిపక్షం లేని సభలో.. కూటమి ఎమ్మెల్యే తీరు ఎలా ఉండబోతుంది.. చంద్రబాబు సర్కార్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క జగన్‌కు ఉందా..?

ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయ్. ప్రతిపక్షం లేని సభలో.. కూటమి ఎమ్మెల్యే తీరు ఎలా ఉండబోతుంది.. చంద్రబాబు సర్కార్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క జగన్‌కు ఉందా.. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయ్. వైసీపీ ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. దీంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఐతే తమకు 40శాతానికి పైగా ఓట్లు వచ్చాయని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్‌కు లేఖ రాశారు జగన్ విడ్డూరంగా ! ఐతే స్పీకర్‌ దానికి క్లియర్‌కట్‌గా నో అని చెప్పేశారు. దీంతో జగన్‌.. అసెంబ్లీకి వస్తారా.. వస్తే ఎక్కడ కూర్చోబెడతారు.. అసలు సభలో జగన్ ఉంటారా అంటూ రకరకాల చర్చ జరుగుతోంది. సీటు విషయంలో స్పీకర్‌.. జగన్‌కు ప్రత్యేక అవకాశం కల్పించడం లేదు.

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సమయంలో.. ఆర్డర్‌లో కాకుండా ముందుగానే జగన్‌ను పిలవాలని వైసీపీ అభ్యర్థనకు ఓకే చెప్పిన అసెంబ్లీ వర్గాలు.. సీటు విషయంలో మాత్రం ఖరాఖండీగా నో అని చెప్పేసింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో.. జగన్ ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో అసెంబ్లీలో ఆయన వెనక సీట్లోనే కూర్చోబోతున్నారు. ముందు వరుసలో సీటు ఇవ్వలేని చెప్పేసిన స్పీకర్‌.. జగన్‌కు ప్రత్యేకంగా ఎలాంటి సీటు కేటాయించలేదు. దీంతో జగన్‌ వెనక సీటుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉండడంతో.. ఇది ఎమోషనల్ డ్యామేజ్ అంటూ.. కామెంట్లు మొదలయ్యాయ్ సోషల్‌ మీడియాలో! అసెంబ్లీలలో ఇప్పటివరకు సీట్ల కేటాయింపు జరగలేదు. దీంతో ప్రమాణస్వీకారం సమయంలో ఎదురైన అనుభవాలే.. ఈసారి కూడా జగన్‌కు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్. ప్రమాణస్వీకారం సమయంలో వెనక సీట్లో కూర్చున్న జగన్‌.. ప్రమాణం చేసి క్షణాల్లోనే వెళ్లిపోయారు.

ఇప్పుడు కూడా వెనక సీట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. సామాన్యసభ్యుడికి ఇచ్చినట్లుగా జగన్‌కు కూడా స్పీకర్‌ టైమ్ ఇస్తారు. ఇక అటు ఇక అటు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రతిపక్ష హోదా అంశం తెరమీదకు వచ్చే చాన్స్ ఉంది. తమకు విపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌కు జగన్ లేఖ రాశారు. ఐతే 11 సీట్లే వచ్చాయని.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం అంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య.. జగన్‌ సభకు వస్తారా.. వచ్చినా కూటమి సభ్యులను ఎదుర్కొనే శక్తి.. వైసీపీ అధినేతకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సరిపోతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.