Jagan Mistakes: ఇంత చిన్న లాజిక్‌.. ఎలా మిస్ అయ్యావ్ జగన్‌!

సభలకు లక్షల్లో జనాలు.. బస్సు వెనక పరిగెత్తుకు వచ్చిన అభిమానులు.. సోషల్‌ మీడియాలో అనుకూలంగా వీడియోలు.. వీటన్నింటి మధ్యలో వైనాట్‌ 175 అని నినాదాలు.. కట్‌ చేస్తే 11 సీట్లకు పరిమితం. ఇదీ ఈ ఎన్నికల్లో వైసీపీ, జగన్ ప్రయాణం. సోషల్‌ మీడియా జోరు మాత్రమే చూసి నమ్మకం పెంచుకున్నారో.. తను మంచి చేశానని జనం అనుకున్నారని అతి విశ్వాసానికి పోయారో కానీ.. ఫలితాల ముందు వరకు జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో కనిపించారు.

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 02:54 PM IST

సభలకు లక్షల్లో జనాలు.. బస్సు వెనక పరిగెత్తుకు వచ్చిన అభిమానులు.. సోషల్‌ మీడియాలో అనుకూలంగా వీడియోలు.. వీటన్నింటి మధ్యలో వైనాట్‌ 175 అని నినాదాలు.. కట్‌ చేస్తే 11 సీట్లకు పరిమితం. ఇదీ ఈ ఎన్నికల్లో వైసీపీ, జగన్ ప్రయాణం. సోషల్‌ మీడియా జోరు మాత్రమే చూసి నమ్మకం పెంచుకున్నారో.. తను మంచి చేశానని జనం అనుకున్నారని అతి విశ్వాసానికి పోయారో కానీ.. ఫలితాల ముందు వరకు జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో కనిపించారు. ఫలితాలు వచ్చాక కూడా మారినట్లు ఏం కనిపించలే. ఆ ప్రేమలు ఏమయ్యాయో.. ఆ ఆప్యాయతలు ఏమయ్యాయో అంటూ.. ఎందుకు ఓడిపోయామో అంటూ తన మార్క్ స్లాంగ్‌లో ఓ కొత్త నినాదం అందుకున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఓ చిన్న తప్పు.. జగన్‌కు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. జనాలకు మంచి చేశాను అని పదేపదే చెప్పుకున్న జగన్.. కార్యకర్తలను గాలికి వదిలేశారనే టాక్ ఉంది. ఈ విషయం మిస్ అయి.. ఇప్పుడు ఓటమికి కారణం తెలియడం లేదు అంటే ఎలా అంటూ.. జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. జనాలకు సాయం చేస్తున్నాను అనుకున్నారే తప్ప.. తాడేపల్లికి మాత్రమే పరిమితం ఇయి 2019లో వైసీపీ అద్భుత విజయానికి కారణం అయిన కార్యకర్తలకు దూరంగా ఉంటున్నాను అనే లాజిక్‌ మిస్ అయ్యారు జగన్. ఆ ఎఫెక్టే ఎన్నికల్లో కనిపించింది. కార్యకర్తలకు కోపం వస్తే… ఫలితం ఏ రేంజ్‌లో ఉంటుందో.. ఎలా పడిపోతామో అని చెప్పడానికి వైసీపీ ఓటమే కారణం అనే చర్చ జరుగుతోంది. గ్రామస్థాయిలో కార్యకర్తలను ఓ విధంగా జగన్ ఆదుకోలేకపోయారు అనేది మరో టాక్‌. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. అంటే 2029 వరకు జగన్ ప్రతిపక్షంగానే ఉండాలి. జగన్‌ వ్యక్తిగతంగా బలవంతుడు కాబట్టి ఈ ఐదేళ్లు నడిచేస్తారు. మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి.. అధికారంలో ఉన్నప్పుడే సపోర్ట్ దక్కలేదని ఫీల్ అవుతున్న వైసీపీ కార్యకర్త.. ప్రతిపక్షంలో ఉండి ఈ ఐదేళ్లు ఎలా పనిచేస్తాడు.. గ్రామస్థాయిలో పార్టీని ఎలా కాపాడతాడు. ఇప్పుడు జగన్ దృష్టి పెట్టాల్సిన విషయం ఇదే. ఇప్పటికీ సమయం ఉంది. అన్నీ నేనే, అన్నింటికీ నేనే అనే ఫీలింగ్ నుంచి బయటకు రా.. కార్యకర్తలతో కలిసిపో.. వారిలో ధైర్యం నింపు అని వైసీపీ అధినేతకు సూచిస్తున్నారు ఇప్పుడు చాలామంది. తగ్గితే తప్పే లేదు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో.. పవన్‌ను చూసి నేర్చుకో జగన్‌ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. కోటరి నుంచి బయటకు వచ్చి.. కార్యకర్తలకు చేరువ అయితే.. ఈ ఐదేళ్లు ఇంకోలా ఉంటుంది అంటూ పలువురు సూచనలు చేస్తున్నారు.