Nandamuri Chaitanya vs Jr NTR : జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు.. నందమూరి చైతన్యకృష్ణ వార్నింగ్‌..

చైతన్య కృష్ణ.. నందమూరి ఇంటి బిడ్డ.. ఈ మధ్యే సినిమాల్లోకి వచ్చాడు. బ్రీత్ అనే సినిమా తీశారు. సినిమా సంగతి ఎలా ఉన్నా.. చైతన్య మీమ్‌ మెటీరియల్‌గా మారిపోయారు.

చైతన్య కృష్ణ.. నందమూరి ఇంటి బిడ్డ.. ఈ మధ్యే సినిమాల్లోకి వచ్చాడు. బ్రీత్ అనే సినిమా తీశారు. సినిమా సంగతి ఎలా ఉన్నా.. చైతన్య మీమ్‌ మెటీరియల్‌గా మారిపోయారు. విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది ఆయన మీద సోషల్ మీడియాలో ! చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. జగన్‌కు చైతన్యకృష్ణ వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయ్‌. అలాంటి చైతన్య కృష్ణ.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి ఏపీ ఎన్నికల్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కుటుంబాల మధ్య చిచ్చు రేగింది రాజకీయాల వల్ల! బన్నీ వ్యవహారంతో మెగా ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయనే చర్చ ఇంకా వినిపిస్తోంది. వైసీపీ అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయడాన్ని మెగా ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది.

నాగబాబు పగవాడు, పరాయివాడు అని ఓ మాట జారేశారు కూడా ! మెగా ఫ్యామిలీలోనే కాదు.. నందమూరి కుటుంబంలోనూ ఇలాంటి రచ్చే జరుగుతుందా అంటే.. చైతన్య కృష్ణ ఇచ్చి వార్నింగ్‌తో అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తారక్‌ ఫ్యాన్స్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చైతన్యకృష్ణ సోషల్‌మీడియాలో… జూనియర్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. మద్దతు ఇచ్చారని చెప్తున్నారని.. ఐనాసరే ఎవరూ ఏమీ పీకలేరు అంటూ చైతన్యకృష్ణ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తానుండగా.. చంద్రబాబును, బాలకృష్ణను టచ్ కూడా చేయలేరు అంటూ రాసుకొచ్చారు చైతన్యకృష్ణ.

తన మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా.. వైసీపీతో కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేశారని గుర్తు చేసిన చైతన్యకృష్ణ.. జాగ్రత్తగా ఉండాలంటూ తారక్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. చైతన్యకృష్ణ పోస్టుతో.. నందమూరి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మీద అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినా.. స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకు పంపించినా.. ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు. అప్పటి నుంచి తారక్‌కు, నందమూరి ఫ్యామిలీకి దూరం పెరుగుతూనే ఉంది. ఆ దూరం ఎంత అన్న దానికి చైతన్యకృష్ణ మాటలు శాంపిల్‌లా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.