CM Jagan, Rajshyama Yagam : ఆ యాగంతో కేసీఆర్ ఓడారు.. మరి జగన్ సంగతి ఏంటి ?

రాజశ్యామల యాగం (Rajshyama Yagam) చేస్తే... రాజ్యాలు దక్కుతాయన్నది సెంటిమెంట్. రాజుల కాలం నాటి వస్తున్న ఈ సంప్రదాయాన్ని... ఈ మధ్యే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా రెండు సార్లు కొనసాగించారు. రెండు సార్లూ అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ (KCR) రాజశ్యామల యాగం చేశారు కానీ... ఈసారి జనం అమ్మవారిని అంతకంటే ఎక్కువగా ప్రార్థించారో ఏమో ఓడిపోయారు.

రాజశ్యామల యాగం (Rajshyama Yagam) చేస్తే… రాజ్యాలు దక్కుతాయన్నది సెంటిమెంట్. రాజుల కాలం నాటి వస్తున్న ఈ సంప్రదాయాన్ని… ఈ మధ్యే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా రెండు సార్లు కొనసాగించారు. రెండు సార్లూ అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ (KCR) రాజశ్యామల యాగం చేశారు కానీ… ఈసారి జనం అమ్మవారిని అంతకంటే ఎక్కువగా ప్రార్థించారో ఏమో ఓడిపోయారు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా జగన్ (CM Jagan) తో అదే యాగం కేసీఆర్ చేయించారని చెబుతారు. అందుకే అప్పట్లో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రాజశ్యామల యాగం చేయాలని … విశాఖ శారదా పీఠం (Visakha Sharada Peetha) నుంచి జగన్ కు పిలుపు వచ్చింది. ఆయన వెళ్తారా ? యాగంలో పాల్గొంటారా అన్నది డౌట్ గా ఉంది.

రాజ శ్యామల యాగం చేసిన ప్రతి ఒక్కరికీ రాజుల కాలంలో అయితే రాజ్యాధికారం… ఇప్పుడు ప్రభుత్వ అధినేత అవుతారన్న టాక్ ఉంది. ఇది నిజమేనా అంటే… దేవుడిని నమ్మేవాళ్ళ బట్టి ఉంటుంది. కేసీఆర్ కి మాత్రం రెండు సార్లు ఆ యాగమే కలిసొచ్చిందని చెబుతారు. రాజశ్యామల అమ్మవారి దయతోనే అధికారం చేపట్టారని చెప్పుకుంటారు. 2019లోనూ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం కూడా ఈ యాగం ఫలితమే అంటారు. విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి (Swaroopanandendra Swamy) … మరోసారి జగన్ తో రాజశ్యామల యాగం చేయించాలని భావిస్తున్నారు. ఈనెల 15 నుంచి 19 వరకూ విశాఖలోని శారదా పీఠంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవాల్లో ప్రతియేటా చివరి రోజున రాజ శ్యామల యాగం జరిపిస్తుంటారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో… యాగంలో పాల్గొనాలని జగన్ కు శారదాపీఠం నుంచి ఆహ్వానం అందింది. ప్రతియేటా వార్షికోత్సవాలకు రెగ్యులర్ గా వెళ్తున్న జగన్… రాజశ్యామల యాగం కూడా చేస్తారా లేదా అన్నది డౌట్ గా మారింది.

కేసీఆర్ ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తారని స్వరూపానంద్రేంద్ర స్వామి అప్పట్లో చెప్పారు. ఆయనతో పాటు కొందరు పండితులు చెప్పడంతో… రాజశ్యామల యాగం ప్రభావంతో గెలుస్తారని అంతా భావించారు. కానీ జనం అంత కంటే ఎక్కువగా ఆ అమ్మవారిని ప్రార్థించారో ఏమో… కేసీఆర్ ప్రగతి భవన్ (Pragati Bhavan) వదిలేసి… ఫామ్ హౌస్ కి వెళ్ళాల్సి వచ్చింది. కానీ జగన్ విషయంలో అలా కాదంటున్నారు వైసీపీ నేతలు. జగన్ రెండు టర్మ్స్ కి మించే అధికారంలో ఉంటారని జ్యోతిష్యులు చెప్పారనీ… అందువల్ల రాజశ్యామల అమ్మవారి దీవనెలను కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పుడు స్వామిజీ మాటలు నమ్మి… జగన్ రాజశ్యామల యాగం చేస్తారా… చేస్తే కేసీఆర్ లాగా ఓడిపోతారా… అమ్మవారి ఆశీస్సులతో గెలుస్తారా… అసలు ఎన్నికల బిజీలో ఉన్న జగన్ శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరవుతారా అన్నది చూడాలి.