KESINENI NANI: భారీ డైలాగ్‌లేస్తున్న కేశినేని నాని.. ఇంతకీ ఆయన టార్గెట్ ఎవరు ?

తాను పార్టీ మారేది లేదని పదేపదే చెప్తున్న నాని.. ఈ మధ్య డైలాగ్‌ల్లో ఘాటు పెంచారు. రోజుకో స్టేట్‌మెంట్‌తో నాని పిచ్చెక్కిస్తున్నారు. ఏ రోజు ఎవరి టార్గెట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఓసారి డైరెక్ట్‌గా చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తే.. మరోసారి తన వ్యతిరేకుల మీద విరుచుకుపడతారు.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 04:16 PM IST

KESINENI NANI: కేశినేని నాని.. రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మనిషి ఎంత గంభీరంగా ఉంటారో.. మాట కూడా అంతే గంభీరంగా వినిపిస్తుంది. వైసీపీ వేవ్‌లోనూ టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరిగా నిలిచి.. విజయవాడ మీద తన పట్టు ఏంటో చాటుకున్నారు నాని. ఐతే ఆ తర్వాత కొంతకాలం ఆయన టీడీపీ మీద అసంతృప్తితో కనిపించారు. వైసీపీకి వెళ్తారేమో అనే ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో ఆయన తమ్ముడు పొలిటికల్‌గా యాక్టివ్‌ కావడంతో.. నాని బైబై చెప్పడం దాదాపు ఖాయం అనుకున్నారు అంతా.

PONNAM PRABHAKAR: ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం..

ఐతే ఇప్పుడు సీన్ మారింది. తాను పార్టీ మారేది లేదని పదేపదే చెప్తున్న నాని.. ఈ మధ్య డైలాగ్‌ల్లో ఘాటు పెంచారు. రోజుకో స్టేట్‌మెంట్‌తో నాని పిచ్చెక్కిస్తున్నారు. ఏ రోజు ఎవరి టార్గెట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఓసారి డైరెక్ట్‌గా చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తే.. మరోసారి తన వ్యతిరేకుల మీద విరుచుకుపడతారు. ఒకరోజు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది తానే అంటారు. మరోరోజు అసలు పోటీలోనే లేనంటారు. ఇండిపెండెంట్‌గా నిలిచినా గెలుస్తా అని ఇంకోసారి అంటారు. దీంతో నాని తీరు ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఐతే న్యూ ఇయర్‌ను కూడా సంచలన వ్యాఖ్యలతోనే మొదలుపెట్టారు నాని. రాబోయే ఎన్నికల్లో తాను కానీ.. తన కూతురు శ్వేత కానీ.. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయడం లేదని అన్నారు. ఐతే కొన్ని కంబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి.. విముక్తి కల్పించేందుకే ఇంచార్జిగా వచ్చానని చెప్పారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

పశ్చిమ నియోజకవర్గంలో కబంధహస్తాలు ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో అర్థం కాని పరిస్థితి. విజయవాడలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగూల్ మీరా లాంటి వాళ్లు.. కేశినేని నానికి వ్యతిరేకులు. ఈ ముగ్గురికి.. మాజీమంత్రి దేవినేని ఉమా తెర వెనక నుంచి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ్. దీంతో ఇప్పుడు నాని ఎవరికి వార్నింగ్ ఇచ్చారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. విజయవాడలో తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారా.. లేదంటే వీళ్లని ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబునే టార్గెట్ చేశారా అన్నది అర్థంకావటం లేదు.