KODI KATHI CASE: 2019 ఎన్నికల టైమ్‌లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటన రేపిన అలజడి అంతా ఇంతా కాదు. ఈ కేసులో జనిపల్లి శ్రీనివాస్ అప్పటి నుంచీ జైల్లోనే ఉన్నాడు. శ్రీనివాస్‌కు బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్.. కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో చేసేదేమీ లేక శ్రీనివాస్, ఆయన కుటుంబం ఆమరణదీక్షకు దిగుతున్నారు.
Lakshadweep: లక్షద్వీప్ లక్ష్యం పర్యాటకమే కాదు.. మోదీ తిరుగులేని ప్లాన్..
కోడి కత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. ఐదేళ్లుగా ఆయన కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అసలు దాడి చేసింది శ్రీనివాస్ కాదని.. వైసీపీ నేత మజ్జి శ్రీను అంటూ ఆయన లాయర్లు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. మరోవైపు సీఎం జగన్ వచ్చి వాంగ్మూలం చెప్తే.. ఈ కేసును ముగించేందుకు కోర్టు కూడా సిద్ధంగానే ఉంది. అయినా జగన్ ముందుకు రాకపోవడంతో.. శ్రీనుకు బెయిల్ రావడం లేదు. దీంతో ఆయన లాయర్లు, కోర్టు కూడా చేసేదేమీ లేకపోతోంది. విశాఖ జైల్లోనే ఉన్న శ్రీనివాస్.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడు. జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని.. దాని ఆధారంగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందని శ్రీనివాస్ చెప్తున్నాడు. శ్రీనివాస్ ఆమరణ దీక్షకు దిగుతుండటం సంచలనం రేపుతోంది. ఆయనకు ఏదైనా జరిగితే ఎన్నికల సమయంలో మరింత రచ్చ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
శ్రీనివాస్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా.. విజయవాడలోని వారి ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగారు. శ్రీనివాస్ తల్లి, సోదరుడు కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం నిరాహారదీక్షల వ్యవహారం రాష్ట్రంలో కొత్త చర్చకు కారణం అవుతోంది. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ.. హైకోర్టులో జగన్ పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు శ్రీనివాస్ నిరాహార దీక్ష వ్యవహారం.. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది.