Krishnam Raju: రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. రఘురామకు వ్యతిరేకంగా ప్రభాస్‌ పెద్దమ్మ..?

జనవరి 20న కృష్ణంరాజు జయంతి వేడుకలు మొగల్తూర్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం గురించి శ్యామలా దేవి కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జయంతి వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 05:09 PM IST

Krishnam Raju: మాజీ మంత్రి, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రాబోతున్నారా..? నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఆమెను బరిలో దింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందా..? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. జనవరి 20న కృష్ణంరాజు జయంతి వేడుకలు మొగల్తూర్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం గురించి శ్యామలా దేవి కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జయంతి వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు ఇంకా పెద్ద పదవి.. అందుకే ఎమ్మెల్సీ మిస్ అయిందా..?

విదేశాల నుంచి వైద్యులను పిలిపించి భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నారు. రాజకీయ అరంగేట్రం నేపథ్యంలోనే సామాజిక కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్యామలా దేవి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమం కేంద్రంగానే ఆమె ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. శ్యామలా దేవి ఓకే చెప్తే.. నరసాపురం పార్లమెంట్‌ నుంచి ఆమెను బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటుబ్యాంక్. రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 ఎన్నికల్లో 32 వేల ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్యామలా దేవికి నర్సాపురం లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.

కృష్ణంరాజు కూడా ఇదే నర్సాపురం నుంచి లోక్‌సభకు గతంలో ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి.. లక్షా 65 వేలకు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు కృష్ణంరాజు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణశాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. ఈ రెండు సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే వైసీపీ.. శ్యామలాదేవి వైపు మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. నరసాపురం వైసీపీ అభ్యర్థిని అధిష్టానం ఇంకా ఫైనల్‌ చేయలేదు. కృష్ణంరాజు జయంతి అనంతరం శ్యామలాదేవి నిర్ణయాన్ని బట్టి వైసీపీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి శ్యామలాదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.