Mega Family VS Allu family : మెగా అల్లు కుటుంబాలు యెడ ముఖం పెడ ముఖం

ఏపీ ఎన్నికల్లో కూటమి (AP Alliance) అఖండ మెజారిటీతో విజయం సాధించడం... రీసెంట్‌గా జరిగిన ప్రమాణస్వీకారాలతో... ఇటు నందమూరి... అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ (Mega Family Celebrations) చేసుకున్నాయి.

 

 

ఏపీ ఎన్నికల్లో కూటమి (AP Alliance) అఖండ మెజారిటీతో విజయం సాధించడం… రీసెంట్‌గా జరిగిన ప్రమాణస్వీకారాలతో… ఇటు నందమూరి… అటు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ (Mega Family Celebrations) చేసుకున్నాయి. అయితే ఒక్కటీ తగ్గింది పుష్ప అన్నట్టు సీన్‌ కనిపిస్తోంది. సెలబ్రేషన్స్‌లో అల్లు ఫ్యామిలీ కనిపించ లేదు. అంతేకాదు.. ఓ మెగా హీరో తన ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) ను అన్‌ఫాలో చేయడంతో.. దూరం మరింత పెరిగిందనిపిస్తోంది. అల్లు.. మెగా ఫ్యామిలీస్‌ ఇక ఎవరికి వాళ్లే అన్నట్లు ఉన్నారు.

అల్లు వారింట ఏం జరిగినా.. మెగా ఫ్యామిలీ సందడి చేయాల్సిందే. మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ అంటే అల్లు ఫ్యామిలీ వుండాల్సిందే. ఒకవేళ బన్నీ షూటింగ్‌లో బిజీగా వుండి రాలేకపోయినా… అల్లు అరవింద్‌ (Allu Arvind) హాజరయ్యేవాడు. పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న టైంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఆల్రెడీ దూరం పెరిగిందంటూ వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్టయింది.

ఎన్నికల్లో బన్నీట్విట్టర్‌ వేదికగా పవన్‌కల్యాణ్‌ మద్దతుగా నిలిచానా… ప్రచారం చేయలేదు. అయితే తన స్నేహితుడు.. నంద్యాల వైసిపి (YCP) అభ్యర్ది రవి చంద్రారెడ్డి తరపున ప్రచారం చేశాడు. దీంతో అల్లు అర్జున్‌ను ట్రోలింగ్‌ చేశారు జనసైనికులు. పుష్ప2 (Pushpa2) మాంచి హైప్‌తో రిలీజ్‌ అవుతున్న టైంలో పవన్‌ ఫ్యాన్స్‌కు దూరం కావడం సరైంది కాదన్న కామెంట్స్‌ కూడా వినిపించాయి. పవన్‌ గెలిచిన తర్వాత ట్విట్టర్ వేదికగా బన్నీ శుభాకాంక్షలు తెలియజేసినా.. చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలో కనిపించకపోవడంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది.

ఎన్నికల్లో గెలిచిన పవన్‌కల్యాణ్‌ చిరంజీవి ఇంటికెళ్లి.. అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయానికి మెగా కుటుంబ సభ్యులందరూ చేరుకుని పవన్‌ను అభినందించారు. మెగా ఫ్యామిలీ కనిపించినా.. అల్లు ఫ్యామిలీకి చెందిన ఒక్కరూ కనిపించకపోవడం షాక్‌ ఇచ్చింది. మెగా సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌ లేకపోవడంతో… చిరంజీవి ఇంటికి పవన్‌ వస్తున్నట్టు అల్లు ఫ్యామిలీకి ఇన్‌ఫర్మేషన్‌ లేదా? వున్నా రాలేదా? అంటూ రకరకాల స్టోరీస్ పుట్టుకొచ్చాయి.

చిరు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌లో… ఇటు ప్రమాణ స్వీకారంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఎన్నికల టైంలో స్నేహితుడికి సపోర్ట్‌ చేసిన విషయంలో బన్నీని ట్రోల్‌ చేసినా.. అల్లు అరవింద్ కూడా రాకపోవడంతో.. మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య తేడాలు బైటపడ్డాయి. ఇందంతా ఒక ఎత్తయితే.. సాయిధరమ్‌ తేజ్‌ అయితే.. ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడంతో డిఫరెన్సెన్స్‌ మరోసారి బహిర్గతమయ్యాయి.

సాయిధరమ్‌ తేజ్, పవన్‌ మధ్య మంచి అనుబంధం వుంది. అన్‌స్టాపబుల్‌ షోకు పవన్‌తోపాటు.. తేజు వచ్చాడు. మేనల్లుడికి లిఫ్ట్‌ ఇవ్వడం కోసం.. బ్రో మూవీలో తీసుకున్నాడు పవన్‌. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మామయ్యను ఎత్తుకుని తిప్పేశాడు తేజు. ఇంతటి అభిమానం వున్న తేజుకు బన్నీ ప్రత్యర్థికి సపోర్ట్‌ చేయడం నచ్చలేదు. దీంతో.. ఇన్‌స్టా వేదికగా అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడంతో… అల్లు.. మెగా ఫ్యామిలీ మధ్య డిపరెన్సెస్‌ మరోసారి హాట్‌ టాపిక్‌ అయింది.