రుషికొండ (Rushi Konda) లో రాజమహల్ (Rajamahal) …జగన్ ముచ్చటపడి కట్టించుకున్న రాజభవనం…మళ్ళీ అధికారంలోకి వస్తే… ఆ మాయా మహల్ లో నివాసం ఉండాలన్నది ప్లాన్. అది టూరిస్టుల కోసం కట్టామని ఇప్పుడు వైసీపీ (YCP) లీడర్లు బుకాయిస్తున్నారు. కానీ అందులో అసలు టూరిస్టుల కోసం కట్టిన రూములే లేవు… అప్పుల్లో కూరుకుపోయి. నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైన ఆంధ్రప్రదేశ్ లో తాను ఉండటగానికి ఇంత కాస్ట్ లీ బిల్డింగ్ కట్టించుకున్నాడా అని జనం నోరెళ్ళబెడుతున్నారు.
రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace)లో మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలు.. ఇలా ఏవి చూసినా… అబ్బో యమ కాస్ట్ లీ… ఆ డిజైన్లు… ఆ హంగులూ… చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అప్పట్లో రాజులు… ఆ తర్వాత సద్దాం హస్సేన్, అమెరికా అధ్యక్ష భవనం లాంటి చోట్ల ఉండే ఖరీదైన వస్తువులు రుషికొండ ప్యాలెస్ లో కనిపిస్తున్నాయి. మొత్తం ఫారెన్ ఇంపోర్టెడ్ సరుకే… ఎక్కడా కూడా ఇండియా మేడ్ వస్తువు లేదంటే… దాని యవ్వారం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. పడుకునే పరుపు, మంచం దగ్గర నుంచి ముఖం చూసుకునే అద్దం దాకా…. బాత్రూమ్ లో కమోడ్స్, కిటికీలకు వాడిన కర్టెన్లు… ఇలా అన్నీ… అన్నీ… విదేశాల నుంచి దిగుమతి చేశారు. చివరకు బాత్రూమ్స్ లో వాడే వాల్ షీట్లు కూడా ఫారెన్ సరుకే. రుషికొండ ప్యాలెస్ లో సీఎం ఫ్యామిలీ ఉండేందుకు… అంటే జగన్ మళ్ళీ సీఎం అవుతాడని అనుకున్నారు. అందుకే ఆయన కుటుంబం కోసమని ప్రత్యేకంగా విజయనగర బ్లాక్ పేరుతో 3 బిల్డింగ్స్ కట్టారు.
ఈ మూడు భవనాలు ఒక దాన్ని మించి మరొకటి కాస్ట్ లీగా ఉన్నాయి. సీఎం పడుకునే బెడ్డు కోసం పెట్టిన ఖర్చు చూస్తే… కళ్ళు బైర్లు కమ్ముతాయి. గోల్డ్ కలర్ తో ఆ రూమ్ మొత్తం మెరిసిపోయేలాగా… షాండ్లియర్లు పెట్టారు. ఈ గదిలో ఫ్లోర్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి గ్రానైట్ తెప్పించారు. మళ్ళీ దాని మీద స్పెషల్ డిజైన్ మార్బుల్ తో చెక్కించారు. సీఎం బెడ్రూమ్ లో మంచం, పరుపు, కుర్చీలు, టేబుల్స్… ఇలా అన్నీ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. ఈ గదిలోనే బయోమెట్రిక్ తో పనిచేసే వార్డ్ రోబ్స్, కాస్ట్ లీ స్పా… టాయిలెట్స్ నిర్మించారు. ఇక్కడ నిర్మించిన కమోడ్ జపాన్ ది. ప్రపంచంలోనే డబ్బున్న మహారాజులు కొనుక్కునే కమోడ్ ఇది. ఈ కమోడ్ కాస్ట్ 15 లక్షల రూపాయలు… అంటే టీడీపీ వాళ్ళు అన్నట్టు… ఒక్క కమోడ్ తో ఆరుగురు పేదలకు ఇళ్ళు కట్టించవచ్చు. సీఎం గదిలో కాకుండా… మిగిలిన బిల్డింగ్స్ లో ఒక్కో కమోడ్ కాస్ట్ 88 వేల దాకా ఉంటుంది.
రుషికొండ ప్యాలస్ కట్టడానికి వాడిన గ్రానైట్, మార్భుల్ అంతా కూడా… ఐదు దేశాల నుంచి తెప్పించారు. వియత్నాం, స్పెయిన్, ఇటలీ, నార్వే, బ్రెజిల్ కు చెందిన మెటీరియల్ యూజ్ చేశారు. అక్కడి నుంచి తెప్పించడమే కాదు… మళ్ళీ వాటికి స్పెషల్ డిజైన్స్ చెక్కించారు. ఈ మహల్ లో వందల సంఖ్యలో షాండ్లియర్లు ఉన్నయ్. ఒక్కోటి రెండున్నర లక్షల రూపాయల కాస్ట్ ఉంది. ఇవి కనీసం వంద ఉంటాయి. ఇవన్నీ ఫారెన్ సరుకే.
ఇక బాత్ టబ్ కాస్ట్ 6 లక్షల రూపాయలు… సీఎం గారు తీరిగ్గా జలకాలు ఆడటానికి జపాన్ నుంచి తీసుకొచ్చారు. ఇంటి బయట గోడల చుట్టూ డెకరేషన్ లైట్స్ పెట్టారు. ఇవన్నీ ఢిల్లీ నుంచి తెప్పించారు. ఒక్కో దీపం కాస్ట్… 60 వేల రూపాయలు ఉంటుంది. ఇవి కూడా దాదాపు 100 దాకా ఉన్నయ్. బ్యూటిఫికేషన్, అలంకరణ కోసం రుషికొండ ప్యాలెస్ లో దాదాపు 4 వేల లైట్లు వాడినట్టు చెబుతున్నారు. జనరల్ గా ప్రతి గదికీ ఏసీలు ఉంటాయి. ఇవి కాకుండా… సీఎం రూమ్ లో విసనరక్ర, ఫ్లవర్ షేపుల్లో ఫ్యాన్లు వాడారు… ఇవి ఒక్కోటి లక్షన్నర కాస్ట్ ఉంటుంది. పదుల సంఖ్యలో ఉన్న వీటిని కూడా విదేశాల నుంచే తెప్పించారు.
వైసీపీ వాళ్ళు అన్నట్టు టూరిస్టుల కోసమే రుషికొండ ప్యాలెస్ నిర్మించారు అనుకుంటే… ఈ ప్యాలస్ కి 450 కోట్లు ఖర్చు చేశారు… అంటే కనీసం 450 రూమ్స్ అయినా కట్టించాలి… కానీ అంత పెద్ద బిల్డింగ్ లో ఉన్నవి 12 బెడ్ రూములు మాత్రమే. అసలు మొత్తం ఏడు భవనాలకు కలిసి లక్షా 48 వేల 413 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉంటే… దానికి 450 కోట్లు ఎలా ఖర్చయ్యాయి. అంటే చదరపు అడుగుకు ఏకంగా 30 వేల రూపాయలు ఖర్చు పెట్టారా? వైజాగ్ లో ఈమధ్యే కట్టిన స్టార్ హోటల్స్ చాలా ఉన్నయ్. అంతెందుకు రాడిసన్ బ్లూ హోటల్ ఉంది కదా… అందులో ఒక్కో సూట్ రూమ్ నిర్మాణానికి … ఫర్నిచర్ తో కలసి కోటి రూపాయలు ఖర్చవుతాయని బిల్డర్లు చెబుతున్నారు. అందులో ఇంతకంటే ఎక్కువ సౌకర్యాలే ఉంటాయి. టీవీలు, సోఫాలు, ఫర్నీచర్ లాంటివి అన్నీ కలిపినా… ఆ హోటల్ రూమ్ కి ఒక చదరపు అడుగు 10వేల రూపాయల దాకా ఖర్చవుతుంది. మరి రుషికొండ ప్యాలెస్ లో చదరపు అడుగుకి 30 వేల రూపాయలు ఎలా ఖర్చయ్యాయో తెలీదు. ఆ రూములు చూస్తే… అంత ఖర్చుపెట్టినట్టు కూడా కనిపించడం లేదు. అత్యంత ఖరీదైనా బిల్డింగ్ నిర్మించినట్టు చెబుతున్నా… ఇందులో ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయో కూడా టీడీపీ ప్రభుత్వం లెక్కలు తేల్చాలని కోరుతున్నారు ఏపీ జనం.