ROJA-MARGADARSI: జగన్‌కి షాకిచ్చిన రోజా.. మార్గదర్శిలో రూ.40 లక్షల చిట్టీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఈనాడు గ్రూప్, మార్గదర్శి అధినేత రామోజీ రావుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో 40 లక్షల రూపాయల చిట్టీ ఉందని అఫిడవిట్‌లో తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 04:19 PM IST

ROJA-MARGADARSI: ఏపీ మంత్రి రోజా.. నగరి అసెంబ్లీ సీటుకు మరోసారి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఆస్తులు 47 శాతం పెరిగాయి అన్నది కూడా పెద్ద వార్త కాదు.. కానీ రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో 40 లక్షల రూపాయల చిట్టీ ఉందని అఫిడవిట్‌లో తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.

AP Election Affidavits: చంద్రబాబు ఆస్తులు 931 కోట్లు, జనసేన మాధవికి 894 కోట్లు ! కళ్ళు తిరిగిపోతున్న ఆస్తుల చిట్టా

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఈనాడు గ్రూప్, మార్గదర్శి అధినేత రామోజీ రావుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత కోపం ఉంది. చంద్రబాబుతో పాటు రామోజీరావు కూడా శత్రువులే. మార్గదర్శి చిట్ ఫండ్స్ జనాన్ని మోసం చేస్తోందనీ.. అందులో ఎవరూ చిట్టీలు కట్టొద్దనీ.. ఒకవేళ ఉన్నవాళ్ళు తొందరగా పాడేసుకోవాలని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఏపీ ప్రభుత్వం అయితే సీఐడీ పోలీసులను పంపి అన్ని మార్గదర్శ చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో తనిఖీలు చేయించింది.. మేనేజర్లను అరెస్ట్ చేయించింది. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. గత ఐదేళ్ళుగా ఈ రచ్చ కంటిన్యూ అవుతోంది. కానీ ఇదే మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో మంత్రి రోజాకు 40 లక్షల చిట్టీ ఉంది. ఎన్నికల అఫిడవిట్‌లో ఏదీ దాచకూడదు కాబట్టి.. చిట్టీ సంగతి బయటపెట్టారు రోజా.

2020 నుంచీ తాను చీటీ కడుతున్నట్టు రోజా తెలిపారు. మార్గదర్శి తప్పుడు సంస్థ అంటూ ఏపీ మంత్రులు ప్రచారం చేస్తుంటే.. అదే కేబినెట్‌లో ఉన్న రోజా మాత్రం 40 లక్షల చిట్టీ ఎలా కడుతోందన్న చర్చ మొదలైంది. ఇది నిజంగా సీఎం జగన్ కి షాక్ ఇచ్చే అంశం. ఈ ఎన్నికల్లో టీడీపీ దీన్ని ఆయుధంగా వాడుకుంటే ఎలా.. అని వైసీపీ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. రోజా మరో చిట్ ఫండ్‌లోనూ చిట్టీలు కడుతోంది. అయినా మార్గదర్శిలో 40 లక్షల చిట్టీ మాత్రం హైలెట్ అవుతోంది.