ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో షర్మిల ఎప్పుడైతే రీ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మధ్య ఫైట్ మామూలుగా జరగడంలేదు. ప్రతీ మీటింగ్‌లో షర్మిల జగన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. అన్న అని కూడా చూడకుండా తీవ్ర విమర్శలు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటూ జగన్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను షర్మిల స్థాయిలో విమర్శించడంలేదు. మొదట్లో జగన్ సైలెంట్‌గా ఉన్నా.. రీసెంట్‌గా ఆయన కూడా షర్మిలను విమర్శించడం మొదలుపెట్టారు. చంద్రబాబు టీంలో చేరి తనను రోడ్డుకు లాగాలని చూస్తోందిన ఆరోపించారు.
తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరి రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) పరువు తీసిందంటూ కామెంట్ చేశారు. అప్పటి నుంచి జగన్ షర్మిల మధ్య రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇలాంటి టైంలో.. నా చెల్లిని మిస్ అవుతున్నానంటూ జగన్ చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు జగన్ రీసెంట్‌గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మీ చెల్లిని మీరు అవుతున్నారా అని అడిగిన ప్రశ్నకు.. ఖచ్చితంగా మిస్ అవుతున్నానంటూ ఆన్సర్ చెప్పారు జగన్. తాను వేరే పార్టీలో చేరినంత మాత్రాన నా చెల్లి కాకుండాపోతుందా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు మాటల నమ్మి కుటుంబాన్ని కూడా షర్మిల మర్చిపోయిందని.. తన కుటుంబానికి అన్యాయం చేసినవాళ్లతో షర్మిల చేతులు కలపడం బాధగా ఉందన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నతంమాత్రానా ప్రేమలు మాయం కావుకదా అంటూ జగన్ చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్నటి వరకూ అన్నాచెల్లెల్లు ఇద్దరూ బద్దశతృవుల్లా విమర్శించుకున్నారు. ఇలాంటి టైంలో జగన్ షర్మల గురించి ఇంత పాజిటివ్ కామెంట్స్ చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.