TDP JANASENA : మోడీ గారూ…ఇదేం బాగోలేదు ! కొత్త కేబినెట్ పై టీడీపీ, జనసేన నిరాశ

కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) కి పట్టాభిషేకం జరిగింది. 71 మంది మంత్రులతో కొలువు దీరింది కొత్త సర్కార్. ఈ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోట దక్కింది.

కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) కి పట్టాభిషేకం జరిగింది. 71 మంది మంత్రులతో కొలువు దీరింది కొత్త సర్కార్. ఈ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోట దక్కింది. కానీ కొత్త కేబినెట్ కూర్పు టీడీపీ, జనసేనను తీవ్రంగా నిరాశ పరిచింది. టీడీపీ (TDP) కి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తే… జనసేనకు (Jana Sena) అది కూడా లేకుండా చేశారు.

కేంద్రంలో NDA సర్కార్ కి ఏపీలో కూటమి ప్రభుత్వం 21 మంది ఎంపీలను అందించింది. ఇందులో 16 మంది టీడీపీ ఎంపీలు ఉంటే, బీజేపీ 3, జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ (BJP) తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్నది టీడీపీకే. 16 మంది ఎంపీలు మద్దతు తీసుకున్న మోడీ ప్రభుత్వం… టీడీపీకి ఇచ్చింది రెండు పదవులే. అందులో ఒకటి కేబినెట్… మరొకటి సహాయం… రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్, పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీ కనీసం 4 కేంద్ర మంత్రి పదవులైనా దక్కతాయని ఆశలు పెట్టుకుంది. కానీ రెండింటితోనే సరిపెట్టడంతో టీడీపీ కేడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఇక జనసేన పరిస్థితి మరీ ఘోరం. రెండు ఎంపీలున్న జనసేనకు కూడా బీజేపీ మొండి చేయి చూపించింది. ఒక్క కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటివాడని పొగడ్తలతోనే సరిపుచ్చారు ప్రధాని మోడీ. ఏపీలో పవన్ సునామీతోనే కూటమి ప్రభుత్వం గెలిచిందని NDA మీట్ లో చెప్పుకొచ్చారు. కానీ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదన్నది అర్థం కాని ప్రశ్న.

కేంద్రంలో NDA మొత్తం చంద్రబాబు కంట్రోల్ లో ఉందని గప్పాలు కొట్టిన టిడిపి నేతలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు కేవలం రెండు మంత్రి పదవులకు ఎలా అంగీకరించారు అంటూ ఆవేదనలో ఉంది టీడీపీ క్యాడర్. NDAలో చక్రం తిప్పుతారనుకున్న చంద్రబాబు… రెండు పోస్టులతో ఎలా సరిపెట్టుకున్నారో అర్థంకాక నిరాశలో ఉంది టీడీపీ క్యాడర్. కేంద్ర కేబినెట్ లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో అయినా టీడీపీ, జనసేనకు అవకాశం దక్కుతుందా చూడాలి.