ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ(Krishnamma)… పాల నురగల పారుతు తెలుగు రాష్ట్రాల జలశయాలకు నిండుకుండల తలపిస్తుంది. కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra) లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.. దీంతో కృష్ణా దానిపై ఉన్న కర్ణాటకలోని ప్రధాన ఆయకట్టు ఆల్మట్టి పూర్తిస్థాయిలో నిండిపోయింది. దీంతో కర్ణాటక నీటి పారుదల అధికారులు దిగువన ఉన్న తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు అట్ ఫ్లో కొనసాగుతుంది. దీంతో జూరాల జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా.. ఆ వదర నీటిని తెలంగాణ – ఏపీ రాష్ట్ర సరిహద్దులో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) కు భారీగా వరద నీరు వచ్చి నిండు కుండలా తలపిస్తుంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి (Almaty Project), తుంగభద్ర (Tungabhadra) నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఉధృతి పెరుగుతుండడంతో జలాశయం గేట్లను ఎత్తేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. 2 రోజుల్లో డ్యామ్ నిండే అవకాశం ఉండటంతో మంగళవారం ఉదయం 11 గంటలకు AP జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైల ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తనున్నారు. కాగా డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగుల వరకు చేరుకుంది. నీటి నిలువ కూడా 156.39టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి రోజుకు 40 టీఎంసీలకు పైగా వరదనీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటోంది. మరో 59టిఎంసీల నీరు చేరితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోనుంది.
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇటు తుంగభద్ర నుంచి అటు జూరాల నుంచి 4.41లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడి గట్టు పవర్‌హౌస్ ద్వారా 18480క్యూసెక్కులు, ఎడమగట్టు పవర్‌హౌస్ ద్వారా 35315క్యూసెక్కుల నీటని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి సీమకు నీళ్లు వదులుతున్నారు. కాగా, శ్రీశైలానికి జూరాల, సుంకేశుల నుంచి 4,41,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.