లైఫ్‌లో ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు. పరిస్థితి ఎటు నుంచి ఎటో వెళ్లిపోతుంది. అదే రాంగ్ స్టెప్ రాజకీయాల్లో వేస్తే ఏంకగా జీవితమే తలకిందులు ఐపోతుంది. కాపు ఉద్యమనే ముద్రగడ పద్మనాభం.. సారీ.. పద్మనాభ రెడ్డి ఈ మాటకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన రాజకీయాలు మొదలుపెట్టిన తీరు.. కాపుల కోసం ఉద్యామాలు చేసిన తీరు.. పవన్‌ను వ్యతిరేకించి ఇప్పుడు విమర్శలు ఫేస్ చేస్తున్న తీరు.. దేనికీ అసలు పొంతన లేదు. ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా ఓ వెలుగు వెలిగిన ముద్రగడ.. ఇప్పుడు అదే కాపు కులానికి దూరమయ్యారు.
పవన్ కళ్యాణ్‌ను ఓడించి తీరుతానని ముద్రగడ చేసిన ఛాలెంజ్.. ఆయన జీవితాన్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కు పడేసింది. బహుశా ఆ ఛాలెంజ్ ఇంపాక్ట్ ఈ స్థాయిలో ఉంటుదని ఆయన కూడా ఊహించి ఉండరు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీరియస్‌గా పాలిటిక్స్‌లో కంటిన్యూ అవ్వడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ బహిరంగ లేఖలు రాయడం మొదలుపెట్టారు. నిజంగా పవన్ విజయాన్ని అంతలా కోరకుంటే నేరుగా వెళ్లి జనసేనలో జాయిన్ అవ్వొచ్చు. అది ఇష్టం లేకపోతే అదే సలహాలు నేరుగా వెళ్లి పవన్‌కే ఇవ్వొచ్చు. కానీ ముద్రగడ ఈ రెండూ చేయలేదు. పవన్ కళ్యాణ్‌కు.. జనసేన కార్యకర్తలు మధ్య గ్యాప్ పెరిగేలా బహిరంగ లేఖలు రాయడం మొదలు పెట్టారు. కానీ ఆయన లేఖల్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటి.. ఎవరి కోసం ఆయన లేఖలు రాస్తున్నారు.. ఎవరు చెప్తే రాస్తున్నారు అనేది చాలా మందికి మొదట్లోనే అర్థమయ్యింది.
ఇక జగన్‌ను ఓడించి తీరుతానని పవన్ ఎప్పుడైతే శపథం చేశారో.. అప్పుడు నేరుగా సీన్‌లోకి ఎంటర్ అయ్యారు పద్మనాభరెడ్డిగారు.. అప్పటి వరకూ ముద్రగడ వేసుకున్న ముసుగు ఆరోజుతో తొలిగిపోయింది. కాపు కులంలో ఆయనకు ఉన్న ఫేమ్ ఆరోజుతో అంతమయ్యింది. పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు పిఠాపురంలో క్యాంపెయిన్ చేశారు. స్వయంగా ఓ మండలానికి బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహించారు. సొంత కులం నాయకున్ని కాదని వేరే కులం నాయకున్ని గెలిపించుకునేందుకు ముద్రగడ పని చేయడంతో కాపు యువతలోనే ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఆఖరికి ఆయన కూతురు ఎదురుతిరిగినా రెడ్డికాపుగారు తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు. కన్న కూతుర్ని వదిలేసుకోడానికి సిద్ధపడ్డారు కానీ.. జగన్‌ను మాత్రం వదులుకోలేదు.
ఇదే ముద్రగడ ఒకప్పుడు కన్న కూతురుకి హీరో.. ఇదే ముద్రగడ ఒకప్పుడు కాపు యువతకు ఐకాన్.. ఒకానొక సమయంలో పవన్ కూడా ముద్రగడను విమర్శించేందుకు వెనకాడారు అంటే.. కాపు కులంలో ఆయనకు ఎంతో పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత చేసిన ముద్రగడ ఆఖరి క్షణంలో తీసుకున్ని నిర్ణయంతో ఏం సాధించారు. ఎలా ఉండే మీ పరిస్థితి ఎలా అయ్యింది.
ఒకప్పుడు మీకు కాపు కాసిన కులం ఇప్పుడు మీకు అండగా లేదు.. మీరు కావాలి అనకున్న కులం మీరెందుకు మాకు అని హేళన చేస్తోంది.. మీ వెంటే తిరిగిన కాపు యువత ఇప్పుడు మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంతి. ఆఖరికి కన్న కూతురు కూడా మిమ్మల్ని ఓ కసాయివాడిలా చూస్తోంది. మీరు సాధించుకున్న అనుభవం.. పేరు.. పరపతి అన్నీ ఒకే ఒక్క నిర్ణయంతో పోగొట్టుకుని మీరు ఏం సాధించారండీ పద్మనాభ రెడ్డిగారు అని కాపు యువత ప్రశ్నిస్తోంది. మరి వాళ్లుకు కాపు నేత ముద్రగడగా సమాధానం చెప్తారా.. లేక పద్మనాభ రెడ్డిగానే సమాధానం చెప్తారా అనేది మీరే ఆలోచించి చెప్పాలి.