RRR : రఘురామకు హ్యాండ్‌.. స్పీకర్‌గా మరో వ్యక్తి

ఏపీలో కొత్త ప్రభుత్వం (AP New Government) కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు.

 

 

ఏపీలో కొత్త ప్రభుత్వం (AP New Government) కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. జనసేన (Janasena) శాసనభాపక్ష నేతగా పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan), టీపీపీ (TDP) శాసనసభాపక్షనేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏసీ అసెంబ్లీ స్పీకర్‌ పదవి మాత్రం అనుకోని వ్యక్తికి వెళ్లింది. ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్‌గా కళా వెంకట్రావును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఈ పదవి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు ఇస్తారని అంతా అనుకున్నారు. ఆ కారణంగానే ఆయనను ఎంపీగా పోటీ చేయించకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయించారని టాక్‌ నడిచింది. కానీ ఆఖరి నిమిషంలో రఘురామ కాకుండా కళా వెంకట్రావు పేరు తెరమీదకు వచ్చింది. రఘురామకు స్పీకర్‌ విషయంలో ముందుకు నుంచీ చాలా చర్చ జరిగంది. ఏపీ స్పీకర్‌గా రఘురామ ఉంటే అసెంబ్లీలో జగన్‌ను ఆడుకుంటారని.. కాబట్టి ఖచ్చితంగా రఘురామకే ఆ పదవి ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేశారు.

కూటమి కూడా లాస్ట్‌ వరకూ ఆ పదవి రఘురామకే అన్నట్టుగా సంకేతాలు ఇస్తూ వచ్చింది. కానీ రాజకీయ కారణాల వల్ల రఘురామ ఆ ఛాన్స్‌ మిస్‌ అయ్యారు. దీంతో ఇప్పుడు ఆయనకు ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. రఘురామకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఆయనకు ఏ పదవి ఆఫర్‌ చేస్తారో చూడాలి.