TDP, State President : ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు.. అచ్చెన్నాయుడిని తప్పించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena)-బీజేపీ (BJP) కూటమితో ఘన విజయం సాధించిన విషయంత తెలిసిందే. మూడు పార్టీల కూటమితో 175 సీట్లకు గానూ 164 సీట్లు లభించగా.. వైసీపీ మాత్రం 11 సీట్లకు పరిమితమైంది.

ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena)-బీజేపీ (BJP) కూటమితో ఘన విజయం సాధించిన విషయంత తెలిసిందే. మూడు పార్టీల కూటమితో 175 సీట్లకు గానూ 164 సీట్లు లభించగా.. వైసీపీ మాత్రం 11 సీట్లకు పరిమితమైంది. ఇందులో టీడీపీ అత్యధికంగా 136 సీట్లు సాధించింది. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూటమి పార్టీలు.

తాజా నేడు మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వారి వారి శాఖలను కేటాయించింది. కొత్త ప్రభుత్వంలో టీడీపీ రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడుని చంద్రబాబు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అచ్చెన్నాయుడు పూర్తిగా టీడీపీ అధ్యక్ష పదవిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం లేకపోవడంతో.. ఆ స్థానంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా.. బీసీ వర్గానికి చెందిన గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు నియమించారు.