తిరుమలలో ఒకటే లడ్డూ… కొత్త రూల్స్

తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసింది టీటీడీ. లడ్డూ ప్రసాదం పొందే భక్తులు ఆధార్ లింక్ చేస్తూ పంపిణీ చేస్తున్నది టిటిడి.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 03:56 PM IST

తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసింది టీటీడీ. లడ్డూ ప్రసాదం పొందే భక్తులు ఆధార్ లింక్ చేస్తూ పంపిణీ చేస్తున్నది టిటిడి. శ్రీవారి లడ్డు ప్రసాదం కావాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ చేయడంతో వివాదం తలెత్తింది. ఆధార్ కార్డు సమర్పించే భక్తుడికి రెండు లడ్డు మాత్రమే అదనంగా టిటిడి ఇస్తుంది. గతంలో శ్రీవారి భక్తులు అడిగినన్ని లడ్డూలు టిటిడి ఇచ్చేది.

రద్దీ సమయంలో లడ్డూ విక్రయాలపై ఆంక్షలు విధించారు. నేటి నుంచి కొత్త విధానం అమలు చేయనుంది టీటీడి. శ్రీవారి లడ్డూ ప్రసాదం మిస్ యూజ్ అవుతుందని భావించి టిటిడి తాజా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు తో లడ్డూ విక్రయాలు చేస్తున్న టిటిడి తీరుపై విమర్శలు వచ్చాయి ప్రస్తుతం రోజూ దాదాపు 3.50 లక్షల లడ్డూలు టిటిడి విక్రయిస్తుంది. ఆధార్ కార్డుతో లడ్డు విక్రయాలపై ఆరోపణలు రావడంతో టిటిడి వివరణ ఇవ్వనుంది.