Non bailable cases on YCP Leaders : వైసీపీ లీడర్లపై నాన్ బెయిలబుల్ కేసులు…. ప్రభుత్వం మారితే జైలు జీవితమేనా ?

ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ అధికారుల బృందం నివేదికను ఈసీకి సమర్పించింది. ఈ కేసుల్లో ఎక్కువగా వైసీపీ నేతల ప్రమేయం ఉండటంతో... వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశాలున్నాయి. దాంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

  • Written By:
  • Updated On - May 22, 2024 / 02:02 PM IST

ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ అధికారుల బృందం నివేదికను ఈసీకి సమర్పించింది. ఈ కేసుల్లో ఎక్కువగా వైసీపీ నేతల ప్రమేయం ఉండటంతో… వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశాలున్నాయి. దాంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

పోలింగ్ నాడు, ఆ తర్వాత… ఏపీలో మాచర్ల, పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. తీవ్రంగా కొట్టుకున్నారు. రక్తపాతం జరిగింది. ఈ ఘటనలపై అప్పట్లో పోలీసులు ఏవో చిన్న చిన్న కేసులు పెట్టారు. కొన్ని చోట్ల చూసీ చూడటనట్టుగా వదిలేసినట్టు ఆరోపణలు రావడంతో చాలామంది పోలీస్ అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత 13 మంది అధికారులతో సిట్ ని ఏర్పాటు చేయడంతో… ఈ కేసుల విషయంలో అదనపు సెక్షన్లు యాడ్ అయ్యాయి. ఇందులో హత్యాయత్నంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. వైసీపీ నేతలు చెప్పినట్టుగా పోలీసులు పనిచేయడంతోనే ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. పల్నాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేసినా… అప్పట్లో ఆయనపై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వెబ్ కామ్ లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపించడంతో… ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఎన్నికల హింస కేసుల్లో ఎక్కువ మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు. రేపో మాపో ఆ లీడర్లను అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం … వైసీపీ నేతలకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. కొంతమందిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.