Pawan Kalyan : ప్రతీ పొలిటీషియన్‌ లీడర్‌ కాలేడు.. పవన్‌కు పూనం కౌంటర్‌?

ఏదో ఒక కాంట్రవర్షియల్‌ ట్వీట్‌ చేస్తూ ఎప్పుడూ నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా ఉంటోంది పూనమ్‌ కౌర్‌ రీసెంట్‌గా త్రవిక్రం గురించి ట్వీట్‌ చేసి నెటిజన్ల చేతిలో చీవాట్లు తిన్న పూనం ఇప్పుడు మరో ట్వీట్‌ చేసి హాట్ టాపిక్‌గా మారింది.

 

 

ఏదో ఒక కాంట్రవర్షియల్‌ ట్వీట్‌ చేస్తూ ఎప్పుడూ నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా ఉంటోంది పూనమ్‌ కౌర్‌ రీసెంట్‌గా త్రవిక్రం గురించి ట్వీట్‌ చేసి నెటిజన్ల చేతిలో చీవాట్లు తిన్న పూనం ఇప్పుడు మరో ట్వీట్‌ చేసి హాట్ టాపిక్‌గా మారింది. లీడర్‌ ఆడవాళ్లను ఎలా గౌరవిస్తే ఆయన ఫాలోవర్స్‌ కూడా అలానే గౌరవిస్తారని.. పదవి అనేది బాధ్యతకు సంబంధించిన విషయం ఐనా కొందరు మాత్రం తమ ఫేమ్‌ పెంచుకునేందుకు వాడుతున్నారని పూనం ట్వీట్‌ చేసింది. ప్రతీ పొలిటీషియన్‌ లీడర్‌ కాలేడంటూ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చింది. పూనం చేసే ప్రతీ ట్వీట్‌ పవన్‌ ఉద్దేశించే చేస్తుంది అని ఫిక్స్‌ ఐన పవన్‌ ఫ్యాన్స్‌ ఆమెను ఆడుకోవడం మొదలుపెట్టారు. చేయడానికి ఎలాంటి సినిమాలు లేక ట్విటర్‌లో నాటకాలు చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నీకు అన్యాయం జరిగినట్టు ఆధారాలు ఉంటే పబ్లిక్‌గా పోస్ట్‌ చేసి న్యాయం కోసం పోరాడు అంటూ మండిపడుతున్నారు.

ఇక రీసెంట్‌గా ఇలాంటి ట్వీటే త్రివిక్రం గురించి చేసింది పూనం. ప్రణీత్‌ హనుమంతు గురించి ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్‌కు త్రివిక్రంను లింక్‌ చేస్తూ కామెంట్‌ పెట్టింది. దీంతో అప్పుడు కూడా త్రివిక్రం ఫ్యాన్స్‌ పూనంను ఆడుకున్నారు. దీంతో వెంటనే ఆ కామెంట్‌ను డెలిట్‌ చేసింది. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటూ పూనంను క్వశ్చన్‌ చేసిన నెటిజన్‌ను బ్లాక్‌ కూడా చేసింది. దీంతో ఆ యూజర్‌ చూడండి నిజం చెప్పే దమ్ము లేకా ఎలా బ్లాక్‌ చేసిందో అంటూ మరో ట్వీట్‌ కూడా చేశాడు. ఇప్పుడు మరోసారి ఇండైరెక్ట్‌గా పవన్‌ గురించి ట్వీట్‌ చేసి మరోసారి వాళ్లతో మాటలు పడుతోంది పూనం కౌర్‌.