JAGAN SISTERS : ఇప్పుడు షర్మిల..ఇకపై సునీత.. జగన్ కు తప్పని చెల్లెళ్ళ పోరు

ఆంధ్రప్రదేశ్ (AP Politics) లో మళ్ళీ అధికారంలోకి రావడానికి పార్టీని గాడిలో పెట్టుకుంటూ... అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ... ప్రతిపక్ష పార్టీల లీడర్లను తిట్టిన తిట్లు పదే పదే తిట్టుకుంటూ... సీఎం జగన్ (CM Jagan) నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది జగన్ తెలియనట్టు ఉంది.

ఆంధ్రప్రదేశ్ (AP Politics) లో మళ్ళీ అధికారంలోకి రావడానికి పార్టీని గాడిలో పెట్టుకుంటూ… అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ… ప్రతిపక్ష పార్టీల లీడర్లను తిట్టిన తిట్లు పదే పదే తిట్టుకుంటూ… సీఎం జగన్ (CM Jagan) నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది జగన్ తెలియనట్టు ఉంది. అందుకే ఇప్పుడు కుటుంబపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే ఏపీసీసీ ఛైర్మన్ (APCC Chairman) గా సొంత చెల్లెలు షర్మిల (YS Sharmila) …అన్న జగన్ ను ఓ ఆటాడుకుంటోంది. ఇప్పుడు కొత్తగా బాబాయ్ కూతురు సునీత కూడా తోడవుతోంది. దాంతో ఇద్దరు చెల్లెళ్ళతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.

జగన్ కు ప్రతిపక్ష లీడర్ల కంటే ఇప్పుడు చెల్లెళ్ళ అంటేనే భయం ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా… అన్న జగన్ పై విమర్శల బాణాలు వదులుతున్నారు. దాంతో ఏం చేయాలో తెలియట్లేదు జగన్ కు. అందుకే వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబానికి దగ్గర అయిన వ్యక్తులతో షర్మిలను తిట్టించడం స్టార్ట్ చేశారు. అటు సాక్షి పత్రిక, టీవీల్లోనూ ఆమెకు వ్యతిరేకంగా బైట్స్, కార్యక్రమాలు ప్రసారం అవుతున్నారు. అందుకే షర్మిల… అసలు సాక్షిలో నాకూ సగం వాటా ఉందని మరో బాంబ్ పేల్చారు.

షర్మిల పోరుతోనే ఏం చేయాలో అర్థం కాక జుట్టుపట్టుకుంటున్న జగన్ కు… ఇప్పుడు మరో చెల్లెలు తోడైంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి కూడా షర్మిలతో జతకడుతున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆమె… జగన్ ను టార్గెట్ చేశారు. సునీత తెలుగుదేశంలో చేరతారని ఆ మధ్య టాక్ నడిచింది. కొన్ని ఏరియాల్లో ఆమె పేరుతో టీడీపీ బ్యానర్లు కూడా వెళిశాయి. కానీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడంతో సోదరితో కలసి నడవబోతున్నారు సునీతా రెడ్డి. కడప జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలతో కలసి వైఎస్సార్ సమాధి దగ్గర ప్రార్థనల్లో సునీతా రెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఇడుపులపాయలో రెండు గంటల పాటు మాట్లాడుకున్నట్టు సమాచారం.

పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి జగన్, కడప పార్లమెంట్ సీటు నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారు. దాంతో వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా బరిలోకి దిగాలని షర్మిల, సునీతా రెడ్డి నిర్ణయించుకున్నారు. కడప పార్లమెంట్ కు సునీత లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచి దించాలని షర్మిల భావిస్తోంది. కాదంటే పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి జగన్ పై తానే పోటీ చేస్తానని షర్మిల చెప్పినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీలోనే పోరాటం జరగనుంది.

జగన్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. కానీ జగన్ ఊహించని రీతిలో కాంగ్రెస్ నుంచి తన ఇద్దరు చెల్లెళ్ళు షర్మిల, సునీత పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలసి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నిజాలు బయటపెడితే జగన్, అవినాశ్ రెడ్డి ఇబ్బందుల్లో పడొచ్చు. రాబోయే ఎన్నికల్లో వివేకా మర్డర్ టాపిక్… కడప, చుట్టుపక్కల జిల్లాల్లో ఎంతో కొంత జగన్ పార్టీని దెబ్బతీసే అవకాశముంది. రాష్ట్రం మొత్తమ్మీద కూడా ప్రభుత్వ నెగిటివ్ ఓటింగ్ ను టీడీపీ, జనసేన, బీజేపీ క్యాష్ చేసుకుంటే… వైసీపీ పాజిటివ్ ఓటులో కొంత భాగాన్ని షర్మిల చీల్చే ఛాన్సుంది. ఈ పరిస్థితుల్లో జగన్ కి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాల్ గా మారనుంది.