Kurnool KE vs Kotla : కుటుంబానికి ఒక్క టిక్కట్టే ! కర్నూల్ లో వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టిన చంద్రబాబు!

రాజకీయ దిగ్గజ కుటుంబాలకు కేరాఫ్‌ ఉమ్మడి కర్నూల్‌ జిల్లా. దశాబ్దాల తరబడి ఆయా కుటుంబాల్లో రెండేసి స్థానాలకు పోటీ చేసే పద్ధతి కొనసాగుతోంది. ఒకరు ఎంపికి, మరొకరు ఎమ్మెల్యేకి, లేదంటే ఇద్దరూ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడం పరిపాటి అయింది. ఇద్దరూ గెలవడం, లేదా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినా... మొత్తంగా ఏళ్ళ తరబడి చట్ట సభల్లో ఆ కుటుంబాల ప్రాతినిధ్యం కొనసాగుతోంది.

రాజకీయ దిగ్గజ కుటుంబాలకు కేరాఫ్‌ ఉమ్మడి కర్నూల్‌ జిల్లా. దశాబ్దాల తరబడి ఆయా కుటుంబాల్లో రెండేసి స్థానాలకు పోటీ చేసే పద్ధతి కొనసాగుతోంది. ఒకరు ఎంపికి, మరొకరు ఎమ్మెల్యేకి, లేదంటే ఇద్దరూ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడం పరిపాటి అయింది. ఇద్దరూ గెలవడం, లేదా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినా… మొత్తంగా ఏళ్ళ తరబడి చట్ట సభల్లో ఆ కుటుంబాల ప్రాతినిధ్యం కొనసాగుతోంది.

పార్టీలు ఏవైనా… కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా నాగిరెడ్డి (Bhuma Nagireddy), ఎస్వీ సుబ్బారెడ్డి కుటుంబాల నుంచి ఇద్దరేసి చొప్పున పోటీ చేసిన సందర్భాలు అనేకం. అయితే ఈసారి ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ టీడీపీ (TDP) ఒక నియమం పెట్టుకుంది. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా, కోట్ల, కేఈ కుటుంబాలు రెండు సీట్లు అడుగుతున్నాయి. అధిష్టానం మాత్రం ఒకటికే ఫిక్స్‌ అయింది. దీంతో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కొత్త ఫిట్టింగ్ పెడుతున్నారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట పార్టీ నేతల్లో. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించగా అందులో కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఇంటికి ఒక టిక్కెట్టు అనేది కుదరదరని పని అని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలన్న సంగతిని అధిష్టానం గుర్తించాలని అన్నారు కేఈ.

గతంలో తమ ఇంట్లో రెండు టిక్కెట్లు ఇస్తే రెండూ గెలిచామని గుర్తుచేశారాయన. కోట్ల, కెఈ కుటుంబాలు డోన్‌లో 10 సార్లు గెలిచాయని, ఇదే విషయాన్ని కేఈ కృష్ణమూర్తి (KE Krishnamurthy), కోట్ల ప్రకాష్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా కోరారు. తమకు రెండు సీట్లు లేవన్నప్పుడు అలాగే అందరి విషయంలో కూడా ఆలోచించుకోవాలన్నారు కేఈ ప్రభాకర్. జిల్లాలో ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఎక్కడ ఇచ్చినా గెలుస్తామంటూ కాస్త గట్టి స్వరంతోనే చెప్పారట ప్రభాకర్‌. రూల్స్‌ గీల్స్‌ జాన్తా నై, మాకు రెండు టిక్కెట్స్‌ ఇచ్చి తీరాలన్నట్టుగానే ఉందట ఆయన వ్యవహారం.

కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు ఇంకా టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదు. వాటిలోఎక్కడో ఒక చోట తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూనే… ఒక కుటుంబానికి ఒక టికెట్ విధానం కుదరదని చెప్పేశారు కేఈ ప్రభాకర్‌. పార్టీ గెలవాలంటే ఇలాంటి రూల్స్‌ పనికిరావని కూడా నేరుగానే అంటున్నారట ఆయన. కేఈ కుటుంబంలో ఇప్పటికే కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబును పత్తికొండ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ప్రభాకర్ డిమాండ్‌కు తలొగ్గి టీడీపీ అధిష్టానం కొన్ని సవరణలు చేస్తుందా? లేక రూల్‌ ఈజ్‌ రూల్‌, రూల్‌ ఫర్‌ ఆల్‌ అంటుందా అన్నది చూడాలి.