Prashant Kishore : బిహార్‌లో పనేం లేదా ? పీకేను ఆటాడుకుంటున్న వైసీపీ నేతలు

2019 ఎన్నికల్లో వైసీపీ (YCP) ని గెలుపుకు కారణమైన కీలక వ్యక్తి ప్రశాంత్‌ కిషోర్‌. అప్పుడు వైసీసీని గెలిపించిన ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishore) ఇప్పుడు అదే వైసీపీ గురించి సంచలన కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ దారుణంగా ఓడిపోబోతున్నారంటూ చెప్పారు. ఒకప్పటితో కంపేర్‌ చేస్తే టీడీపీ, జనసేన బలంగా బాగా పెరిగిందని..

 

 

2019 ఎన్నికల్లో వైసీపీ (YCP) ని గెలుపుకు కారణమైన కీలక వ్యక్తి ప్రశాంత్‌ కిషోర్‌. అప్పుడు వైసీసీని గెలిపించిన ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishore) ఇప్పుడు అదే వైసీపీ గురించి సంచలన కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ దారుణంగా ఓడిపోబోతున్నారంటూ చెప్పారు. ఒకప్పటితో కంపేర్‌ చేస్తే టీడీపీ, జనసేన బలంగా బాగా పెరిగిందని.. ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఏపీలో 55 శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌ గెలుచుకునే అవకాశమున్నట్టు చెప్పారు పీకే. వైసీపీ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా వరకు స్థానాలు పోతాయని..

ఇక ఉత్తరాంధ్రలో టీడీపీ(TDP), జనసేన (Janasena) క్లీన్‌ స్వీప్‌ చేస్తాయంటూ చెప్పారు. ఇంత నేరుగా ఆన్సర్‌ చెప్పిన తరువాత వైసీపీ నేతలు ఊరుకుంటారా? పీకే మీద మాటల యుద్ధం మొదలుపెట్టారు.
పీకే స్టేట్‌మెంట్‌ అలా బయటికి వచ్చిందో లేదో.. ఇలా ఎటాక్‌ స్టార్ట్‌ చేశారు వైసీపీ నేతలు. ఎలాంటి సర్వే చేపట్టకుండా తాము ఓడిపోతున్నట్టు పీకే ఎలా చెప్పారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబుతో రెండు గంటలు భేటీ తరువాత ఇలాంటి కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదంటూ చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందిస్తున్న వైసీపీ మీద బురద జల్లేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

ఇక మంత్రి అమర్నాథ్‌ కూడా పీకేకు కౌంటర్‌ ఇచ్చారు. పీకేతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబుకు ఒక పీకే సరిపోక ఇంకో పీకేను అద్దెకు తెచ్చుకున్నారంటూ చెప్పారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఏపీలో ఎలా చెల్లుతుంది అంటూ కామెంట్‌ చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీ ప్రజలు జగన్‌వైపే ఉన్నారంటూ చెప్పారు. ఇక సోషల్‌ మీడియాలో కూడా వైసీపీ నేతలు పీకే మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నాడంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకప్పుడు ఎవరి సూచనలతో పొలిటికల్‌ స్టెప్స్‌ వేశారో.. ఇప్పుడు అదే వ్యక్తిపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.