జనసేనాని (Jana Sena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా ఏపీ మంత్రివర్గం (AP Cabinet) లో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఓ నేషనల్ ఛానెల్ లో ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని తేలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే తన ప్రాధాన్యత అని కూడా పవన్ తేల్చి చెప్పారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం (AP TDP Alliance) మరో రెండు రోజుల్లో కొలువుదీరబోతోంది. ఈనెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తున్నారు. మంత్రివర్గంలో జనసేనకు 3 నుంచి నాలుగు పదవులు, బీజేపీకి రెండు బెర్తులను కేటాయించనున్నట్టు తెలిసింది. పవన్ కేబినెట్ లో చేరతారా లేదా అన్న డౌట్స్ వచ్చాయి. అయితే మంత్రివర్గంలో చేరుతున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో పవన్ ఏ శాఖలను హ్యాండిల్ చేయబోతున్నారన్న చర్చ ఏపీలో మొదలైంది.
ఏపీలో కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కు మంచి పోర్టుఫోలియోలను కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. గత ఐదేళ్ళల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు వరస్ట్ గా తయారయ్యాయన్న ఒపీనియన్ ఉంది. పవన్ కూడా ప్రతి సభలోనూ ఇదే విషయం చెబుతూ వచ్చారు. అలాగే జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వకపోవడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఏపీలో కీలకమైన హోంమంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలను పవన్ కు కేటాయించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లో మంత్రి వర్గ కూర్పుపై పవన్, చంద్రబాబు కలసి చర్చిస్తారు. అలాగే కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో… తమకు ఏపీలో 4 నుంచి ఐదు కేబినెట్ పోస్టులు ఇవ్వాలని పవన్ కోరుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.