BABU CABINET : పవన్ ఇన్ – లోకేశ్ ఔట్ బాబు కేబినెట్ లో వీళ్ళేనా ?

మరో వారంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ (TDP) ఆధ్వర్యంలోని NDA కూటమి (NDA Alliance) అధికారంలోకి రాబోతోంది. ఈనెల 12న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.

 

 

 

మరో వారంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ (TDP) ఆధ్వర్యంలోని NDA కూటమి (NDA Alliance) అధికారంలోకి రాబోతోంది. ఈనెల 12న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అయితే బాబు కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కతుంది అన్నదానిపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ కేబినెట్ లో చేరతారా లేదంటే తన పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి… ఇతర బాధ్యతలు చేపడతారా అన్నదానిపై స్పష్టత రాలేదు. పవన్ ని ఉన్నత పదవిలో చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారు. అందువల్ల డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అలాగే ఈసారి నారా లోకేశ్ మంత్రివర్గంలో చేరకుండా… పూర్తిగా పార్టీపై దృష్టి పెడతారన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీని అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. చంద్రబాబు ఈసారి క్లీన్ ఇమేజ్ ఉన్ననేతలకే మంత్రివర్గంలో చోటు ఇచ్చే ఛాన్సు ఉందని తెలుస్తోంది. సీనియర్లకన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.

బాబు కేబినెట్ (Babu Cabinet) లో ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చు అన్నదానిపై… టీడీపీలో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే… శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీ మోహన్, కళా వెంకట్రావు, విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao), అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావుకి ఛాన్సుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమగోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుుడు, రఘురామ కృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, శ్రీరాం తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు పేర్లు పరిశీలనలో ఉండే అవకాశముంది. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పేర్లు ఉంటాయి. ఆ పార్టీకి నలుగురు దాకా అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. బీజేపీ నుంచి ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారధి పేర్లు వినిపిస్తున్నాయి.