PAWAN KALYAN: పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్.. వద్దన్న జనసేనాని.. కారణం ఇదే..

ఈ నెలలో జరగనున్న తమ యూనివర్సిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరై.. డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను యూనివర్సిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే, ఈ ఆహ్వానాన్ని జనసేనాని సున్నితంగా తిరస్కరించారు.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 03:20 PM IST

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో నిలబడలేకపోయినప్పటికీ.. సినిమాల్లో ఆయన స్థాయి ప్రత్యేకం. ఒకవైపు పొలిటికల్ పార్టీ నడుపుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. సైనిక అమర వీరుల కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది గుర్తించిన తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ పవన్‌ కళ్యాణ్‌కు డాక్టరేట్ ప్రదానం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెలలో జరగనున్న తమ యూనివర్సిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరై.. డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను యూనివర్సిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

అయితే, ఈ ఆహ్వానాన్ని జనసేనాని సున్నితంగా తిరస్కరించారు. తనకంటే అర్హులు, గొప్పవాళ్లు ఎందరో ఉన్నారని, వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ సూచించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ”వేల్స్ యూనివర్సిటీ నన్ను గౌరవ డాక్టరే‌ట్‌కు ఎంపిక చేయడాన్ని సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను. కానీ, నాకంటే గొప్పవాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో సరైన వారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నందున యూనివర్సిటీలో జరిగే ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాలేకపోతున్నాను” అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు. తమ అభిమాన నటుడు పవన్‌కు డాక్టరేట్ రావడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఆయన డాక్టరేట్ తీసుకోవడానికి నిరాకరించడం వారికి నిరా శ కలిగించింది.

కానీ, ఈ విషయంలో పవన్ తీరును చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎవరైనా.. తమకు డాక్టరేట్ ఇస్తామంటే వద్దని చెప్పరు. కానీ, పవన్ డాక్టరేట్ నిరాకరించడమే కాకుండా.. తనకంటే గొప్పవాళ్లు ఎందరో ఉన్నారని, వారికి ఇవ్వాలి అని సూచించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదైనా పవన్ నిర్ణయాలు ఊహాతీతంగానే ఉంటాయి. యూనివర్సిటీ అందించే డాక్టరేట్ వద్దని చెప్పడం నిజంగా విశేషమే.