JAGAN SAME MISTAKE : నువ్వు మారవా జగన్ ! మళ్ళీ అదే తప్పులు చేస్తావా

ఏపీలో వైసీపీని జనం దారుణంగా ఓడించారు. 5యేళ్ళు రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లు ఇచ్చారు. జగన్ ఓటమికి కారణం ఏంటనే దానిపై పార్టీ నేతలే గత 15 రోజులుగా బహిరంగంగా చెబుతున్నారు.

 

 

ఏపీలో వైసీపీని జనం దారుణంగా ఓడించారు. 5యేళ్ళు రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లు ఇచ్చారు. జగన్ ఓటమికి కారణం ఏంటనే దానిపై పార్టీ నేతలే గత 15 రోజులుగా బహిరంగంగా చెబుతున్నారు. గ్రౌండ్ లెవల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టించుకోకుండా… జనం అభిప్రాయాలు తెలుసుకోకుండా పరదాల మాటున పనిచేశాడు జగన్. అంతకంటే దారుణంగా… ఒకట్రెండు సర్వే సంస్థలు… నలుగురైదుగురు అడ్వైజర్లు అనే భజనపరుల మాయలో జీవించారు. జగన్ రియాలిటీకి దూరంగా ఉండటం వల్లే…జనం వైసీపీని ఈడ్చి కొట్టారు. ఇప్పటికైనా జగన్ మారతాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళ్తున్నట్టు… ఆయనతో సమావేశమైన వైసీపీ లీడర్లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

గత ఐదేళ్ళల్లో జగన్ ఎప్పుడూ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసింది లేదు. అంతా సలహాదారులే చూసుకున్నారు. జగన్ ని ఎవరూ కలవకుండా తాడేపల్లి ఆఫీసులో తిష్టవేసుకొని కూర్చున్నారు. అపాయింట్ మెంట్ ఇప్పించలేదు. సరే … ఎన్నికల తర్వాత ఖాళీగా ఉండటంతో… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు జగన్ ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకునేందుకు నేతలతో భేటీ అవుతున్నారు. మొదటి రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యలతో సమావేశమయ్యారు. రెండో రోజు రాజ్యసభ సభ్యులు, ఎంపీలతో భేటీ అయ్యారు. పార్టీ ఓటమికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకున్నారు జగన్. ఇక్కడ లీడర్ల ఒపీనియన్స్ కంటే… పార్టీ ఎందుకు ఓడింది… మీరెందుకు ఓడిపోయారో చెబుతా అంటూ… జగన్ మళ్లీ నివేదికలను ముందేసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను జగన్ లైట్ తీసుకుంటున్నారట. చాన్నాళ్ళకు మా అధినేత కలిశాడు… క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో చెప్పుకుందామని వచ్చిన లీడర్లు జగన్ ధోరణి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ దిక్కుమాలిన నివేదికలే మన కొంపలు ముంచాయి. ఐప్యాక్ మాయలో పడి నిండా మునిగిపోయాం… ఇప్పుడు మళ్ళీ సర్వేలు పక్కనబెట్టుకొని పోస్ట్ మార్టమ్ చేయడం అవసరమా అని తెగ మధనపడిపోతున్నారు.

పార్టీ కేడర్ మొత్తం కూడా ఈ ఓటమికి జగన్ పూర్తి బాధ్యుడని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థతో స్థానిక నాయకత్వాన్ని నాశనం చేశాడు. కేడర్ ను పట్టించుకోకుండా సలహాదారుల బోడి సలహాలతో ముందుకెళ్ళాడు. ఇప్పటికైనా జగన్ పద్దతి మారాలని అంటున్నారు. కోటరీ చెప్పుడు మాటల నుంచి, పనికిరాని చెత్త సర్వేల మాయ నుంచి బయటపడాలని జగన్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళోసారి ఓదార్పు యాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇటీవల అల్లర్లలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించబోతున్నారు. అప్పుడైనా ప్రతి జిల్లాలో వైసీపీ లీడర్లు, కార్యకర్తల నుంచి ఇన్ పుట్ తీసుకోవాలని కోరుతున్నారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా… మళ్ళీ సర్వేలు, అడ్వైజర్ల మాయలో పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు వైసీపీ నేతలు.