YS Jagan : ఇక నువ్‌ మారవా జగన్..

ఏపీ జనాలకు.. జగన్‌కు మాములు షాక్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో 151సీట్లతో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. కట్ చేస్తే ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.

ఏపీ జనాలకు.. జగన్‌కు మాములు షాక్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో 151సీట్లతో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. కట్ చేస్తే ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన ఐదేళ్లకు కేవలం 11 సీట్లకు పడిపోయింది వైసీపీ. ఐతే ఈ ఓటమిని జగన్ ఇంకా ఒప్పుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఆ ప్రేమలు ఏమయ్యాయో, ఆప్యాయతలు ఏమయ్యాయో అని పదేపదే అంటున్న జగన్‌… పోలింగ్‌లో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తన పార్టీకి 40శాతం ఓటు బ్యాంక్ ఉందని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అమాయకంగా అర్ధం లేని వాదన అందుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పార్టీ పడిపోవడానికి కారణాలు వెతకాల్సింది పోయి.. ఇంత తామే కరెక్ట్ అనుకున్నట్లు జగన్ కనిపిస్తున్నారు. దీంతో జగన్ నువ్‌ మారవా అంటూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా మారు.. జనం ఏమనుకుంటున్నారో.. జనంలో పార్టీ గురించి ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయో తెలుసుకో అంటూ సొంత పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఓడిపోయి.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నెల రోజలుు గడుస్తున్నా.. జగన్‌లో మాత్రం మార్పు కనిపించడంలేదు అనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికీ తాను అద్భుతంగా పాలించానని.. అయినా జనం తనను ఓడించారనే అభిప్రాయంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఓడిన తనకే జనాల్లో తనకే ఆదరణ ఉందని, గెలిచిన చంద్రబాబుకు లేదని ఆయన మాట్లాడుతుండడం మరింత విచిత్రంగా వినిపిస్తోంది. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించిన జగన్… ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడిన మాటలపై కొత్త చర్చ జరుగుతోంది. అన్యాయం జరిగింది కాబట్టే పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టాడని.. దానికి కోర్డు బెయిల్ ఇచ్చింది కదా అంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయ్. జనాల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదని.. జనాలకు మంచి చేసి పార్టీ ఓడిపోయిందని.. చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలకు జనాలు కాస్తో కూస్తో ఇదై… ఒక పది శాతం కాస్తా అటు షిఫ్ట్ అయి.. కూటమి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అంటూ జగన్ మాట్లాడిన మాటలపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. జగన్ ఏ మాత్రం మారలేదని.. ఇంకా తాను గొప్పగానే పాలించాననే భ్రమలో ఉన్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.