2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… ఈసారి సీఎం జగన్ ఓటమిని కోరుకుంటున్నాడు. ఎన్నికలకు ముందు అనేక ఇంటర్వ్యూల్లో ఈసారి జగన్ ఘోరంగా ఓడిపోతాడని చెప్పిన ఆయన… పోలింగ్ తర్వాత కూడా అదే మాట చెబుతున్నాడు. ఈమధ్య ఐప్యాక్ టీమ్ తో సమావేశమైన జగన్… పీకేను ఏకిపారేశారు. వైసీపీ ఓడిపోతుందన్న పీకే స్టేట్ మెంట్స్ ని కొట్టిపారేయడంతో పాటు… ఆయన గెలిపించిన దానికంటే ఎక్కువే సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేశారు సీఎం జగన్.
జగన్ కామెంట్స్ పై ప్రశాంత్ కిశోర్ లేటెస్ట్ గా స్పందించారు. ఏపీలో జగన్ దారుణంగా ఓడిపోతారు …నేను గతంలో చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. పీకే గెలిపించిన సీట్లకంటే ఎక్కువే వస్తాయని జగన్ కామెంట్స్ పైనా రెస్పాండ్ అయ్యాడు. జగన్ అలా చెప్పుకోవడంలో తప్పులేదనీ… గతంలో రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ కూడా ఇలాగే చెప్పుకున్నారు. కానీ 10ఏళ్ళుగా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా అని కామెంట్ చేశారు. 2014లో కూడా జగన్ గెలుస్తానని ప్రకటించుకున్నారు… ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లు పూర్తయినా… పుంజుకుంటామని చెబుతారనీ… ఎన్నికల్లో అది కామన్ అంటున్నారు ప్రశాంత్ కిశోర్. ఏపీలో వైసీపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నా… ఒప్పుకునే స్థితిలో జగన్ లేకపోవడం విచారకరమన్నారు పీకే. గతంలో కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని…. మొన్నటి జగన్ స్టేట్ మెంట్స్ తో వైసీపీ కేడర్ లో భరోసా వచ్చింది. కానీ ప్రశాంత్ కిశోర్ మాత్రం… వైసీపీ ఓడుతుందని పదే పదే చెబుతుండటంతో ఆ పార్టీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. జూన్ 4న ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.